Jr NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.బాల నటుడిగా తన కెరియర్ ప్రారంభించిన ఎన్టీఆర్ అనంతరం తన కెరియర్ మొదట్లోనే హీరోగా పెద్ద పెద్ద దర్శకుల సినిమాలు చేసి ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు.ఈయన కెరియర్ మొదట్లోనే వివి వినాయక్ రాజమౌళి వంటి దర్శకులతో సినిమాలు చేసి ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ నమ్మిన స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయి ఏకంగా కోట్ల రూపాయల డబ్బులను నష్టపోయారు. అసలు ఎన్టీఆర్ అంత డబ్బును ఎందుకు నష్టపోవాల్సి వచ్చిందనే విషయానికి వస్తే… ఎన్టీఆర్ సింహాద్రి సినిమా తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నిర్మాతలు ఆయన కాల్ షీట్స్ కోసం ఎగబడ్డారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్నేహితుడు నిర్మాతల దగ్గర ఎన్టీఆర్ కాల్ షీట్స్ మీకు ఇప్పిస్తానని చెప్పి భారీ మొత్తంలో అడ్వాన్స్ గా డబ్బును తీసుకున్నారు. అయితే ఎన్టీఆర్ డేట్స్ వాళ్లకు ఇవ్వకపోవడమే కాకుండా అనంతరం ఈయన ఆంధ్రావాలా, నా అల్లుడు, వంటి పలు డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే నిర్మాతలందరూ ఎన్టీఆర్ వద్దకు వచ్చి మీ వల్ల మేము ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాము మాకు డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ నిలదీశారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నేను మీకు డేట్స్ ఎప్పుడు ఇచ్చాను అని ప్రశ్నించారు.అదేంటి మీరు డేట్ ఇస్తారనే కదా మీ స్నేహితుడికి అడ్వాన్స్ గా డబ్బు ఇచ్చాము అని నిర్మాతలు అతనిపై నిందలు వేశారు.అయితే ఈ విషయం తెలియని ఎన్టీఆర్ ఈ విషయం గురించి ఆరా తీయడంతో తన స్నేహితుడు ఇలాంటి మోసం చేశారని గ్రహించి నిర్మాతలతో మాట్లాడి వారికి తప్పకుండా డేట్ ఇస్తానని చెప్పారు.ఇక నిర్మాతలు వినకపోవడంతో స్వయంగా ఎన్టీఆర్ అడ్వాన్స్ గా వారు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వడమే కాకుండా తన పేరు చెప్పి మోసం చేసిన తన స్నేహితుడిని తన దరికి చేరకుండా దూరం పెట్టారట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…