Tammareddy Bharadwaj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ కేవలం నటుడుగా మాత్రమే కాకుండా తనలో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇలా నటుడిగా వ్యాఖ్యాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా బాలకృష్ణ సినిమాల గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణకు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇక్కడ ఈయన సినిమాలు మంచి కలెక్షన్లను రాబడతాయి. అయితే ఒకానొక సమయంలో అమెరికాలో బాలకృష్ణ సినిమాలు పెద్దగా కలెక్షన్లను రాబట్టేవి కాదు. ఇక కొన్ని సినిమాలు అయితే అసలు అమెరికాలో విడుదల కూడా చేయలేదు.
ప్రస్తుతం బాలయ్య సినిమా అయినా టాక్ షో అయినా అమెరికాలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయని తమ్మారెడ్డి వెల్లడించారు.అఖండ సినిమా అమెరికాలో ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే బాలకృష్ణకు అమెరికాలో ఈ విధమైనటువంటి ఆదరణ అఖండ సినిమా ద్వారా వచ్చిందా లేకపోతే అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా వచ్చిందా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈయన సినిమాలకు అమెరికాలో మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు.
అఖండ సినిమా విడుదలైన తర్వాత 22 సంవత్సరాల క్రితం బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని కూడా రీ రిలీజ్ చేయడంతో అమెరికాలో మంచి కలెక్షన్లు రాబట్టాయి. దీన్నిబట్టి చూస్తుంటే అఖండ సినిమా తరువాత అమెరికాలో బాలయ్య సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందని వెల్లడించారు. ఇక అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా కూడా బాలకృష్ణ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక అమెరికాలో అయితే ఈ కార్యక్రమాన్ని చూడటం కోసం ఏకంగా స్పెషల్ బిగ్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…