Senior Actor Narasimharao : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. నీడలేని ఆడది వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.
నన్ను చెప్పకుండా తీసేసి చంద్రమోహన్ ను పెట్టుకున్నారు… డబ్బు అలా పోగొట్టుకున్నాను…
కన్నడ సినిమాతో మొదలై ఆ తరువాత తెలుగులో నీడలేని ఆడది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరసింహారాజు గారు నీడలేని ఆడది సినిమా కంటే ముందే తెలుగులో సినిమా అవకాశం అందుకున్నారు. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ‘ప్రజానాయకుడు’ సినిమాకు ఎంపిక చేశారు. జగ్గయ్య, జానకి ల అబ్బాయి పాత్రలో నటించాలి. రెండు రోజుల షూటింగ్ తరువాత సినిమాలో నుండీ తీసేసారు. నిజానికి అప్పటికి నరసింహారాజు గారు లావుగా ఉన్నారట. మొదట చూసినపుడు బాగున్నాడని సినిమాకు తీసుకున్నా కెమెరా ఫ్రేమ్ లో చూసినపుడు బాగా లావుగా కనిపిస్తూ ఉండటం తో సినిమా నుండి తీసేసి చంద్రమోహన్ గారిని ఆ పాత్రలో పెట్టుకున్నారట.
దీంతో కసిగా సన్న బడి నీడలేని ఆడది సినిమాలో అవకాశం దక్కించుకున్నానని నరసింహారాజు గారు తన అనుభవాలను పంచుకున్నారు. ఇక సినిమాల్లో ఐదు వేలు వస్తే పదివేల ఖర్చు చేయడం వల్ల ఆస్తులను సంపాదించుకోలేదంటూ ఆయన తెలిపారు. తండ్రి దానధర్మాల వల్ల ఆస్తులన్నీ కరిగిపోయాయని ఇక నేను బ్రతకడానికి నా ఖర్చులకు సంపాదించడం మొదలు పెట్టాను. ఎప్పటికప్పుడు నేను సంపాదించింది ఇంటి ఖర్చులకు అయిపోయింది పెద్దగా ఆస్తులను చేయలేకపోయాను కానీ చెడు అలవాట్లు కూడా లేవు నాకు అంటూ కేవలం పేకాట అదేవాడిని అదికూడా చాలా మితంగానే క్లబ్ లో ఆడేవాడిని అంటూ చెప్పారు నరసింహారాజు గారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…