Senior Heroine Radha : కైకాల సత్యనారాయణ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన సీనియర్ హీరోయిన్ రాధ…!

Senior Heroine Radha : ‘సిపాయి కూతురు’ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసిన కైకాల గారు దాదాపుగా 700 పైగా సినిమాల్లో నటించారు. అందులోనూ అన్ని రకాల పాత్రలు చేసిన ఆయన ‘నవరస నట సార్వభౌమ’ బిరుదును అందుకున్నారు. నాటకాల రంగం నుండి వచ్చిన అయన ఎస్వి రంగారావు గారి తరువాత అన్ని పాత్రాల్లోనూ ఒదిగి పోయి ఆయనను గుర్తుచేసిన నటుడు. నిర్మాతగాను కొన్ని సినిమాలను నిర్మించిన కైకాల గారు 1935 లో కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు. డిసెంబర్ 23 శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. గతేడాది కరోనా తరువాత ఆయన ఆరోగ్యం కుంటుపడిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, శీతకాలం కావడంతో కైకాల గారి ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు. ఆయనను చివరిసారిగా చూడటానికి సినిమా ఇండస్ట్రీ నుండి ఎంతో మంది తారలు తరలి వచ్చి ఆయననతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

కైకాల గారి గురించి తలచుకుని ఎమోషనల్ అయిన హీరోయిన్ రాధ…

శుక్రవారం తెల్లవారుజామున స్వగృహంలో మరణించిన కైకాల గారి పార్థివ దేహానికి నివాళులర్పించడానికి సీనియర్ హీరోయిన్ రాధ గారు వచ్చారు. ఆయనతో దాదాపు చాలా సినిమాల్లో నటించిన రాధ గారు ఆయన గురించి తలచుకుని ఎమోషనల్ అయ్యారు. హీరోలు హీరోయిన్లు మారినా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు సినిమాల్లో రిపీట్ అవుతారు. ఎన్నో సినిమాల్లో ఆయణ విలన్ గా, నాకు తండ్రిగా, మావయ్య గా ఇలా ఎన్నో సినిమాల్లో ఆయన కాంబినేషన్ లో నటించాము.

కైకాల గారితో మంచి అనుబంధం ఉంది. సుమారుగా ఇద్దరం 50 సినిమాల్లో కలిసి నటించము అంటూ ఆయన ఎపుడు కలిసినా చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తారు అంటూ తెలిపారు రాధ. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు రాధ.