Featured

Senior Journalist Bhardwaja : వీరసింహా రెడ్డి సినిమా సెట్స్ కి వెళ్లి బాలకృష్ణను కలిసింది పవన్ కళ్యాణ్ అందుకే..!! షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ…!

Senior Journalist Bhardwaja : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ తీవ్రంగా సీఎంతో సహా విమర్శిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాత్రమే. తెలుగుదేశం వాళ్ళను పక్కన బెట్టి మరీ పవన్ ను టార్గెట్ చేసారు. చంద్రబాబు కి పవన్ సహకరిస్తున్నారని, పవన్ చేత చంద్రబాబు జనసేనను నడిపిస్తున్నారు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక తాజాగా వీరసింహా రెడ్డి సెట్స్ లో బాలకృష్ణను పవన్ కళ్యాణ్ కలవడం, ఇక మరోసారి తెలుగుదేశం, జనసేన పొత్తు గురించిన ఊహగానాలకు ఊతం ఇచ్చాయి. ఇక ఈ విషయాల మీద అసలు వారిద్దరూ ఎందుకు కలిశారు అనే అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

అందుకే వారిద్దరూ కలిశారు…

తెలుగు దేశం కు జనసేన దగ్గరవుతోంది అనే అనుమానాల నడుమ పవన్ వెళ్లి బాలకృష్ణ ను కలవడం ఆసక్తి రేపుతోంది. ఈ విషయాల మీద మాట్లాడుతూ భరద్వాజ గారు రెండు విషయాలను ప్రస్తావించారు. బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టాపబుల్ షోకి త్వరలో పవన్ కళ్యాణ్ వస్తాడంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నిజానికి ఆఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేకపోయినా వస్తారనే ఊహగానాల నడుమ ఈ కలయిక జరుగుండొచ్చు. పవన్ షో గురించి బాలకృష్ణతో చర్చించుకోడానికి అయ్యుండొచ్చు. కానీ ఆ షోలో బోల్డ్ గా ప్రశ్నలు అడిగితే వచ్చిన గెస్ట్ సమాధానం చెబుతుంటాడు. ఇలా ముందే వారిద్దరూ బహిరంగగా కలిస్తే ఆ షో క్రెడిబిలిటీ పోతుంది.

పోనీ కలిసిన వారు తాము ఎందుకు కలిశామో చెబితే ఏ గొడవా ఉండదు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఇక మరో కోణం రాజకీయంగా తెలుగుదేశానికి జనసేన దగ్గరవుతోంది అందుకే కలిసి ఉండవచ్చు. బీజేపీ నుండి పవన్ కి ఎలాంటి హామీ వచ్చిందో ఇప్పటికీ స్పష్టత లేకపోయినా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో కలిసి వైసీపీ ని ఓడించాలని ఆలోచిస్తున్నారు పవన్. అందుకే తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ను కలిసి ఉండవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు. అయితే అన్ స్టాపబుల్ కి పవన్ వచ్చినా అందులోనూ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago