Movie News

Nagababu -Roja: నాగబాబు జబర్దస్త్ వీడటానికి రోజానే కారణమా…. అసలు విషయం చెప్పిన రోజా!

Nagababu -Roja: బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా నాగబాబు రోజా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇలా నాగబాబు తప్పుకోవడంతో అందుకు గల కారణం రోజా అనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ వార్తలపై తాజాగా రోజా స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగబాబు జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడానికి తాను ఏమాత్రం కారణం కాదని తెలిపారు. ఇక నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయనతో తాను ఎప్పుడు మంచిగానే ఉన్నానని తెలిపారు.

నాగబాబు సైతం తనను పలు సందర్భాలలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారని తెలిపారు. నేను నిర్మాతలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని నాగబాబు నా గురించి చెప్పేవారు. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్న సమయంలో నాకు నాగబాబు గారికి ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తన వ్యక్తిగత కారణాలవల్ల జబర్దస్త్ వదిలి వెళ్లిపోయారనీ ఈ సందర్భంగా రోజా క్లారిటీ ఇచ్చారు.

Nagababu -Roja: రాజకీయాలతో బిజీగా ఉన్నటువంటి రోజా…

ఇక ఈమె దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. అయితే ఈమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఇలా వెండితెరపై ఎన్నో హిట్ సినిమాలలో నటించిన రోజా బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండటంవల్ల ఇండస్ట్రీకి ఈమె దూరమయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago