Featured

Actor Bharath Reddy : పవన్ కళ్యాణ్ నాకు ఏం స్పెషల్ కాదు… అతను నాకు కనెక్ట్ అవ్వలేదు..: నటుడు భరత్ రెడ్డి

Actor Bharath Reddy : డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడు అంటూ కొంతమందిని అంటూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం డాక్టర్ అయి ఆ తరువాత యాక్టర్ అయ్యాడు. అలా అని తన వైద్య వృత్తిని వదిలేయలేదు. అటు డాక్టర్ గా సేవాలాందిస్తూనే మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అతను మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి. చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండే భరత్ రెడ్డి నిజానికి డాక్టర్ అని చాలా మందికి తెలియదు. వెంకటేష్ గారి సినిమా ‘ఈనాడు’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న భరత్ రెడ్డి ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. ఇక తన మీద వచ్చిన నెగెటివ్ కామెంట్స్ గురించి కూడా భరత్ క్లారిటీ ఇచ్చారు.

పవన్ నాకు స్పెషల్ కాదు…

భరత్ రెడ్డి మాట్లాడుతూ సినిమాల్లో తనకు నాగార్జున, బాలకృష్ణ గారు కనెక్ట్ అయినట్లు మరెవరూ కనెక్ట్ అవలేదంటూ తెలిపారు. ఒకసారి నటుడుగా పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా పవన్ కళ్యాణ్ మంచి నటుడే నాకేం స్పెషల్ గా ఏమి లేదు అంటూ జవాబు ఇచ్చారు. అయితే ఆ జవాబు చాలా మందికి నచ్చలేదు నన్ను బాగా ట్రోల్స్ చేసారంటూ భరత్ రెడ్డి తెలిపారు.

నాకు ఆయన కనెక్ట్ అవ్వలేదు అందుకే నాకు స్పెషల్ కాదు, అదే విషయం చెబితే చాలా మందికి నచ్చలేదు కానీ అదే వాస్తవం. నాకు ఇండస్ట్రీలో నాగార్జున గారు, బాలకృష్ణ గారు కనెక్ట్ అయినట్లు ఇంకెవరూ కనెక్ట్ అవ్వలేదు వారి దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అంటూ ఆయన అభిప్రాయాలని పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago