Movie News

Tunisha Sharma: షూటింగ్ లొకేషన్లోనే ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి తునీషా.. పోలీసుల అదుపులోకి సహనటుడు!

Tunisha Sharma: బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిందీ సీరియల్స్ లో సీరియల్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తునీషా శర్మ షూటింగ్ లొకేషన్లో మేకప్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈమె ప్రస్తుతం అలీబాబా దస్తాన్ ఈ కాబూల్ సీరియల్ లో నటిస్తున్నారు.

ఈ సీరియల్ షూటింగ్ లోకేషన్ లోనే మేకప్ రూమ్ లో ఈమె ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించినటువంటి యూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే తునిషా ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలియజేశారు. అయితే ఈమె మృతికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తులో భాగంగా ఈమె సహనటుడు షీజన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సీరియల్ జోడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వీరిద్దరూ నిజజీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరి ఫోటోలను మరొకరు షేర్ చేసుకోవడం వంటివి చేసేవారు.

Tunisha Sharma: పోలీసుల అదుపులోకి షీజన్ ఖాన్….


ఇక ఈమె అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కూడా షీజన్ ఖాన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.అయితే ఉన్నపలంగా ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతూ తన సహనటుడు ప్రియుడు అయినటువంటి షీజన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago