Senior Journalist Bhardwaja : అక్కినేని నటించాల్సిన రక్తసంబంధం సినిమాలో ఎన్టీఆర్ హీరో… అసలు ఏం జరిగింది… 60 ఏళ్ళ రక్త సంబంధం తెరవెనుక రహస్యాలు ఎన్నో : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bharadwaja : అnna చెల్లెళ్ళ అనుబంధం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి. కానీ వాటాన్నింటికీ ఇప్పటికీ రెఫరెన్స్ గా ఉన్న చిత్రం మాత్రం ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెళ్లుగా నటించిన ‘రక్త సంబంధం’. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో దూండి, సుందర్ లాల్ మెహత నిర్మాతలుగా తమిళ సినిమా ‘పాసీమలర్’ ను రీమేక్ చేశారు. ట్రాజెడీ సినిమాలో దిట్ట ఏఎన్ఆర్ గారు కానీ ఆయనను కాదని రక్త సంబంధం సినిమా లో ఎన్టీఆర్ ను హీరోగా తీసుకున్నారు నిర్మాత. సావిత్రి ని చెల్లెలి పాత్రకు తీసుకున్నందున అన్నగా ఏఎన్ఆర్ ను తీసుకుంటే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అనే మీమాంస వల్ల ఎన్టీఆర్ చెల్లిగా సావిత్రి ని ఒప్పుకునే అవకాశం ఉంది అని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు దూండి మరియు సుందర్ లాల్ మెహత.

రికార్డు వసూళ్లతో రక్తసంబంధం…

ట్రాజెడీ సినిమాల్లో కూడా సత్తా చాటారు ఎన్టీఆర్ రక్త సంబంధం, రాము, గుడిగంటలు వంటి సినిమాలు ట్రాజెడీ సబ్జెక్టు తో వచ్చినా హిట్లుగా నిలిచాయి. ఇక రక్తసంబంధం సినిమా ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అటు తమిళం ఇటు తెలుగు రెండింటిలోనూ ఇప్పటికీ అన్నా చెల్లెళ్ళ సినిమా అంటే ఆ సినిమానే రెఫరెన్స్ గా ఉంది. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఈ సినిమాకు డైలాగులు రాసింది ముళ్ళపూడి వెంకట రమణ. హాస్య ప్రధాన నవలలు రాసే ఆయనను ట్రాజెడీ సినిమాకు డైలాగులు రాయడానికి పెట్టుకోవడం ఏమిటి అంటూ ప్రశ్నలు ఎదురైనా నిర్మాత లోతుగా జీవితం తెలిసిన వాడే హాస్యం పండించగలడు అని ఒప్పించి రక్తసంబంధం కు రాయించుకున్నారు.

ఇక సినిమాలో సావిత్రి, ఎన్టీఆర్ నటన ఇక ఘంటసాల గారి సంగీతం ప్రేక్షకుడిని థియేటర్ నుండి కన్నీళ్లతో బయటికి వచ్చేలా చేసాయి. తమిళంలో శివాజీ గణేశన్, సావిత్రి నటించిన సినిమా ఎంత ఘన విజయం అయిందో అంతే హిట్ తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్ సినిమా కూడా అయింది. రిపీట్ లో కూడా ఈ సినిమా హిట్ అయింది అంటూ ఆ సినిమా విశేషాలను పంచుకున్నారు భరద్వాజ గారు.