Anudeep: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ అనుదీప్ గురించి అందరికీ సుపరిచితమే జాతి రత్నాలు వంటి అద్భుతమైన కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈయన తాజాగా శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనుదీప్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈయన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
గాడ్ ఫాదర్ సినిమా చూశారా అంటూ ఈయనకు ప్రశ్న ఎదురయింది.చాలామంది నన్ను గాడ్ ఫాదర్ చూశారా చూశారా అంటూ ప్రశ్నిస్తున్నారని ఇలా అందరూ అడగడంతోనే తాను ఈ సినిమా చూశాను అంటూ ఈయన తెలిపారు.అయితే నాకు సినిమా ఏ మాత్రం నచ్చలేదని చాలా బోరింగ్ అనిపించింది అంటూ అనుదీప్ గాడ్ ఫాదర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే ఈ సినిమా గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ విన్న యాంకర్ ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా మీరు ఏ గాడ్ ఫాదర్ గురించి మాట్లాడుతున్నారు అంటూ తిరిగి ప్రశ్నించారు.నేను మాట్లాడుతుంది హిందీ గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆ సినిమా నాకు నచ్చలేదు ఈ విషయాన్ని నేను ధైర్యంగా ఎక్కడైనా చెబుతా అంటూ ఈయన చివరిలో ట్విస్ట్ ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించే అనుదీప్ మాట్లాడి ఉంటారని, చివరిలో ఇలా మాట మార్చారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…