Movie News

Sharwanand: విమానం నుంచి కింద పడిపోయా… కోలుకోవడానికి రెండున్నర యేళ్ళు పట్టింది: శర్వానంద్

Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో యంగ్ హీరోలకు తమ్ముడి పాత్రలలో నటించి అనంతరం హీరోగా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నారు యంగ్ హీరో శర్వానంద్.ఈయన హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఒకే ఒక జీవితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు.

యంగ్ హీరో అడివి శేష్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ తాను నటించిన జాను సినిమా షూటింగ్ నిమిత్తం ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా తాను 15000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విమానం నుంచి కింద పడిపోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాట చిత్రీకరణలో భాగంగా తాను స్కై డైవింగ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం తాను శిక్షణ కూడా తీసుకున్నానని తెలిపారు.15,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకు దూకగానే ఒక్కసారిగా పారాషూట్ ఓపెన్ కాలేదని దాంతో దాని కింద పడిపోయానని శర్వానంద్ తెలిపారు. ఇలా అంత ఎత్తు నుంచి కింద పడటంతో తనకు బాగా దెబ్బలు తగిలాయని వెల్లడించారు.

Sharwanand: తీవ్రంగా గాయాలు అయ్యాయి..

విమానంలో నుంచి కింద పడగానే చేతికి రెండు ప్లేట్లు వేసి 24నట్లు బిగించారని అలాగే కాలికి కూడా ఒక ప్లేట్ వేశారు అంటూ అప్పుడు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ఇలా ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవడానికి సుమారు రెండున్నర సంవత్సరాల పాటు సమయం పట్టిందనీ ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago