Featured

Senior Journalist Bhardwaja : కృష్ణుడు, కర్ణుడు, సుయోధణుడి పాత్రలో ఎన్టీఆర్ విశ్వరూపం… ఇండియాలో అతిపెద్ద సినిమా… డివిఎస్ కర్ణ మూవీ వెనుక ఆసక్తికర అంశాలు : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : మహాభారతం లోని కురుక్షేత్రం ఉదంతం తో తెరకెక్కిన రెండు చిత్రాలు ఒకటి ఎన్టీఆర్ ‘డివిఎస్ కర్ణ’ అయితే మరొకటి కృష్ణ ‘కురుక్షేత్రం’. రెండు సినిమాల్లోనూ ఒకటే కథ. ఇక ఎన్టీఆర్ త్రిపాత్రభినయం చేస్తూ కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా మూడు పాత్రలలో మెప్పించారు. ఇక ఆయన తనయులు హరికృష్ణ అర్జునుడు గా బాలకృష్ణ అభిమన్యుడిగా మెప్పించారు. కేవలం 45 రోజుల్లో షూటింగ్ చేసిన ఈ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది. 1977 జనవరి 14 న సినిమా విడుదల అయి కోటి రూపాయల గ్రాస్ అప్పట్లోనే సాధించి రికార్డులు సృష్టించింది.

కొండవీటి వెంకట కవి రచన ఎన్టీఆర్ ఆలోచనలు కలిసి డివిఎస్ కర్ణ…

చాలా కాలంనుండి ఎన్టీఆర్ కు కర్ణుడు మీద సినిమా చేయాలనే ఆలోచన ఉండడం, అందుకు అనుగుణంగా డైలాగులు రాయగల వ్యక్తి కోసం వెతుకుతున్న సమయంలో గతంలో కథనాయకుడి కథ సినిమాకు పనిచేసిన మోదుకురి జాన్సన్ గారు డైలాగులు రాసారు. అందులో హీరో పాత్ర కర్ణుడి పాత్ర. బలహీన వర్గాలు ఇండియా లో ఎలా నష్టపోతున్నాయి అన్న కోణంలో ఆయన రాసిన డైలాగులు ఎన్టీఆర్ ను ఆకట్టుకున్నాయి. ద్రావిడ భావజాలం ఉన్న ఎన్టీఆర్ జాన్సన్ అయితే బాగుంటుందని భావించి పిలవగా ఇతర సినిమాలతో బిజీగా ఉన్న ఆయన పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ కొండవీటి వెంకట కవి గారిని సిఫార్సు చేశారు.

ఆయనను పిలిపించుకుని సినిమా ఎలా తీయాలనీ ఎన్టీఆర్ అనుకున్నారో ఆ లైన్స్ చెప్పి డైలాగలను వెంకట కవి వద్ద రాయించుకున్నారు. వెంకట కవి గారికి సహాయంగా పొన్నూరు సంస్కృతం కళాశాలలో పనిచేసే మరో అధ్యాపకుడు కత్తి పద్మారావు ను కూడా తీసుకున్నారు. ఎలా ఎన్టీఆర్ ఆయన చెప్పాలనుకున్న అప్పటి పరిస్థితుల్లో బలహీనలకు జరుగుతున్న అన్యాయం, ప్రతిభ ఉండి అందుకోలేకపోతున్న అవకాశాలు అన్న కోణం. అలాగే ఆర్య సంస్కృతి ప్రభావం ద్రావిడ సంస్కృతి మీద వంటి అంశాలను దాన వీర శూర కర్ణ ద్వారా సమాజానికి చెప్పారు. అందులో ఆయన సక్సెస్ అయ్యారు సినిమా కలెక్షన్స్ ద్వారా అంటూ భరద్వాజ సినిమా వెనుక ఇన్న అనేక అంశాలను చెప్పారు.

Bhargavi

Recent Posts

కోహ్లీ లైక్ వివాదం మళ్లీ రచ్చ.. మోడల్ స్పందనతో కొత్త మలుపు..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…

1 hour ago

ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది.. రెజీనా ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…

2 hours ago

రూ. 60 కోట్లు పెట్టినా ప్రయోజనం లేదు.. జట్లను ముంచేస్తున్న ముగ్గురు ఆటగాళ్లు

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…

2 hours ago

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

14 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

14 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

14 hours ago