DAV public school re-open issue : నాలుగేళ్ళ చిన్నారి మీద జరిగిన అత్యాచారం ఘటనతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. డిఏవి పబ్లిక్ స్కూల్ లో ఎల్కేజీ పాపను ఆ స్కూల్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. రెండు నెలలుగా పాపను బెదిరించి అత్యాచారం చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తెలియగా డ్రైవర్ ను అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇక స్కూల్ గుర్తింపు రద్దు చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంధ్రారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఘటనలో పాప కుటుంబానికి ఏ మాత్రం న్యాయం జరగక మునుపే మళ్ళీ స్కూల్ ను రీ ఓఎన్ చేసారు. యధాతతంగా తరగతులు నిర్వహిస్తుండటంతో పాప తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగగా కేసు వాదిస్తున్న న్యాయవాది ఉదయ్ కాంత్ కూడా వారితో కలిసి ఆందోళన చేసారు.
ప్రభుత్వం స్కూల్ యాజమాన్యంతో లంచాలు తీసుకుని డ్రామాలు చేస్తోంది…
అడ్వకేట్ ఉదయ్ కాంత్ మాట్లాడుతూ రేప్ జరిగినా స్కూల్ ను తిరిగి రీ ఓపెన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. బాధిత పాపకు న్యాయం చేయకుండా ఎలా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ఆరోపించారు. ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది, స్కూల్ యాజమాన్యంతో లంచాలు తీసుకుని స్కూల్ కి అనుమతులు ఇచ్చారంటూ చెప్పారు. ప్రభుత్వం నుండి కానీ స్కూల్ యాజమాన్యం నుండి కానీ ఎవరూ పాప తల్లిదండ్రులతో మాట్లాడలేదు అంటూ న్యాయవాది ఆరోపించారు.
స్కూల్ లో ఆరు, ఏడవ తరగతి విద్యార్థులకు ఇంకా స్కూల్ అనుమతి ఇవ్వకుండానే తరగతులను ఎలా ప్రారంభించారు, ఎంత లంచం ఇచ్చి విద్యాశాఖ అధికారులు ఇలాంటి పనులు చేసారు అంటూ బాధిత తల్లిదండ్రులతో కలిసి పాప తరుపున కేసు వాదిస్తున్న న్యాయవాది స్కూల్ ముందు ధర్నా చేసారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…