Kampalli Udayakanth : గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలోనూ సంచలనం సృష్టిస్తున్న ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల పాప మీద స్కూల్ డ్రైవర్ అత్యాచారం. రెండు నెలలుగా పాపను వేదిస్తున్న ఆ డ్రైవర్ మరి కొంతమంది పిల్లలను కూడా ఇలాగే లైంగిక వేధింపులకు గురిచేసాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రిన్సిపాల్ మాధవి కి డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి స్కూల్ లో కూడా టీచర్స్ మీద అజమాయిషి చేసేవాడని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్ ను అలాగే ప్రిన్సిపాల్ మాధవి ని కూడా అరెస్ట్ చేసారు. ఇక స్కూల్ గుర్తింపు ను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే స్కూల్ గుర్తింపు ను రద్దు చేసిన ప్రభుత్వం మళ్ళీ స్కూల్ కు అనుమతులను మంజూరు చేసింది. 700 మంది పిల్లలు చదువుతున్న స్కూల్ లో ఆ పాప కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఓపెన్ చేసినట్లు చెబుతున్నా రద్దు చేసినప్పటి నుండి ఇప్పుడు ఏం జరిగింది అన్న విషయం మీద విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది…
ఇక పాప కేసు కి సంబంధంచి కేసును వాదిస్తున్న అడ్వకేట్ కాంపల్లి ఉదయ్ కాంత్ గారు మాట్లాడుతూ అప్పుడు అంత త్వరపడి ఎందుకు రద్దు చేసారు స్కూల్ అనుమతులను ఇప్పుడు ఎవరిని అడిగి మళ్ళీ అనుమతులు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలనే ఉద్దేశంతో లేదంటూ ఆరోపించారు. ఇంత మంది పిల్లలు చదివుతున్న స్కూల్ ను రద్దు చేసి వారు కట్టిన ఫీజు లను వాపస్ చేయమని ప్రభుత్వం అదేశించింది. సుమారుగా 700 మంది పిల్లలు చదివుతున్న స్కూల్ లో అందరికీ ఫీజు వెనక్కి ఇవ్వాలంటే కోట్లలో చెల్లింపులు జరగాలి అలా చేయలేరు. ఇక్కడ స్కూల్ రద్దు చేయడం పాప కు న్యాయం చేయడం కాదు. అలాగే మిగిలిన పిల్లలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ ఓపెన్ చేశామని ప్రభుత్వం చెబుతోంది.
మరి ఆ పాప కుటుంబం పరిస్థితి ఏంటి, మధ్య తరగతి కుటుంబంకు చెందిన ఆ కుటుంబం ఇద్దరి పిల్లలను అక్కడే చదివిస్తున్నారు. పాపకు ఇలా జరిగినపుడు వారికి ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు వెళ్లి భరోసా ఇవ్వాలి, ధైర్యం చెప్పాలి, మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి వాళ్లకు అదే స్కూల్ లో కొనసాగుతారా లేక వేరే స్కూల్ వెళ్తారా అని అడిగి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఈ గవర్నమెంట్ కు కేవలం రాజకీయాలు కావాలి, పాప కేసు విషయంలో బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ న్యాయవాది ఆరోపించారు. అందువల్లే పాప తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ధర్నా చేసారు. నేడు వారికి ఏ న్యాయం చేయకుండా కనీస పరామర్శ లేకుండా ఇలా ప్రభుత్వం ప్రవర్తించడం బాగోలేదని అన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…