Senior Journalist Bhardwaja : డబ్బింగ్ సినిమా కోసం వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి పై దిల్ రాజు కుట్ర… సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య వెనక్కి తగ్గుతారా?? సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ పెద్ద మార్కెట్. చాలా సినిమాలు పండగ అప్పుడు పోటీ పడుతాయి. ముఖ్యంగా పెద్ద హీరోలకు సంక్రాంతి పండగ సెంటిమెంట్ ఉంటుంది. పంటలు చేతికి వచ్చి రైతులతో డబ్బు ఉంటుంది కాబట్టి వినోదం కోరుకుంటారు. అలా సంక్రాతి పండగ అంటే తెలుగు నెల. మీద కోడిపందేలు, ఎడ్లపందేలు మాత్రమే కాదు ఇష్టమైన హీరో సినిమా కూడా. ఇక సంక్రాంతి అనగానే బాలయ్య గుర్తొస్తాడు. ఎక్కువగా సంక్రాంతికి హిట్స్ కొట్టేది బాలయ్య బాబే. ఇక ఈసారి బాలయ్యతో పోటీ పడుతూ అగ్ర హీరో చిరు కూడా బరిలోకి దిగుతున్నాడు. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ అంటూ వస్తుంటే చిరు ‘వాల్తేరు వీరయ్య’ అంటూ రాబోతున్నాడు. అయితే వీరిద్దరినీ పక్కకు జరగండి అంటూ దిల్ రాజు తమిళ హీరో విజయ్ సినిమా ‘వారసుడు’ ని పండగకు బరిలో నిలపనున్నాడు. ఇక ఈ సినిమాల్లో ఏది సంక్రాంతి బరిలో ఉండనుంది ఏది వెనక్కి తగ్గనుందో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ విశ్లేషించారు.

ఆ రెండు సినిమాలను వాయిదా వేయించే పనిలో దిల్ రాజు…

దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాకుండా థియేటర్స్ ను కూడా తన చేతిలో పెట్టుకోవడం వల్ల ఎవరి సినిమా విడుదల అయినా ఆయన సినిమాకు థియేటర్ వెతుక్కునే పని లేదు. ఇక దిల్ రాజు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీస్తున్న సినిమా వారసుడు. తమిళ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రాబోతోందో లేక తమిళం లో వచ్చి తెలుగులో డబ్బింగ్ అవుతుందో తెలియదు. అయితే దిల్ రాజు ఇప్పుడు వారసుడు సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని అనుకుంటున్నారట. ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ దిల్ రాజు ఇంతకుముందు మాట్లాడుతూ డబ్బింగ్ సినిమాలు స్ట్రైట్ సినిమాలు ఎక్కువ ఉన్నపుడు విడుదల వాయిదా వేసుకోవాలని చెప్పేవారు.

ఇప్పుడు ఆయన సినిమా సంక్రాంతి బరిలో నిలపాలంటే ముందు వారసుడు సినిమా తెలుగు తమిలం ద్విభాషా చిత్రమా లేక తెలుగులో డబ్బింగ్ చిత్రమా అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ అది ద్విభాషా చిత్రమైతే పర్లేదు కానీ డబ్బింగ్ అయి అది స్ట్రైట్ సినిమాలకు పోటీగా పండగ సీజన్ లో విడుదల చేస్తే ఆయన మాటలను ఆయనే తప్పినట్లు అవుతుంది అంటూ చెప్పారు భరద్వాజ గారు. ఇక సంక్రాంతి బరిలో ఒక్కోసారి 7 స్ట్రైట్ సినిమాలు వచ్చిన సందర్భం ఉంది కాబట్టి ఎన్ని సినిమాలు వచ్చినా జనాలకు ఏ సినిమా నచ్చుతుందో అది హిట్ అవుతుంది. అందులోనూ జనాలు థియేటర్ కి రావడానికి ఆలోచిస్తున్న ఈ పరిస్థితి లో ఏ సినిమాకైనా అగ్నిపరీక్షే అంటూ అభిప్రాయపడ్డారు.