Karate Kalyani : తన సాంగ్స్ తో యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఎప్పుడూ తన పాటలతో వైరల్ అయ్యే డిఎస్పి ఈసారి మాత్రం వివాదంతో వైరల్ అవుతున్నాడు. తన రీసెంట్ సూపర్ సెన్సేషన్ పుష్ప, ఈ సినిమా అందులోని పాటలను కేవలం సౌత్ వాళ్లనే కాదు నార్త్ వాళ్లనూ పిచ్చెక్కించాయి. దీంతో ఇప్పుడు నార్త్ లో దేవిశ్రీ కి మంచి క్రేజ్ ఉంది. ఇక తాజాగా పలు బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంటున్న దేవిశ్రీ తాజాగా టీ సిరీస్ కోసం ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేసారు. అందులో తానే పాట పాడుతూ డాన్స్ చేస్తూ కనిపించారు. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ పాటలో కొన్ని పదాలు కొంతమంది మనోభావాలను దెబ్బతీశాయి.
దేవిశ్రీ మీద కేసు పెట్టిన కరాటే కళ్యాణి…
దేవిశ్రీ విడుదల చేసిన టీ సిరీస్ కొత్త ఆల్బమ్ లో ‘హరే రామ హరే కృష్ణ’ అనే పదాలను పాటలో వాడారు. అయితే బీచ్ లో బికినీ వేసుకున్న అమ్మాయిలతో ఆ పదాలను పాడిస్తూ డాన్స్ చేయించడం హిందూ ధర్మంని కించపరచడమే అంటూ కొన్ని హిందూ సంస్థలు దేవిశ్రీ మీద గుర్రుగా ఉన్నాయి. ఇక బీజేపీ ఆల్రెడీ దేవిశ్రీ మీద విమర్శలు గుప్పిస్తుంటే సినిమా నటి కరాటే కళ్యాణి ఏకంగా సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
ఆ పాటలోని పదాలు ఎంతో పవిత్రమైనవి, వాటిని ఐటమ్ సాంగ్ కు వాడుకోవడం హిందూ ధర్మాన్ని కించపరచడమే. ఒక హిందువు అయ్యుండి ఇలా ఎలా చేసావ్ డిఎస్పి అంటూ ఫైర్ అయింది. ‘ఊ అంటావా ఉహు అంటావా’ అంటూ ఐటమ్ సాంగ్స్ చేసిన నువ్వు ఇప్పుడు ఎంతో పవిత్రమైన హరే రామ హరే కృష్ణ లను ఐటమ్ సాంగ్ లో వాడుకోవడం తప్పు అంటూ ఆమె అభిప్రాయపడ్డారు. దీనికి సంబందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…