Movie News

Actress Savitri: మహానటి సావిత్రికి చివరి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎందుకు సాయం చేయలేదో తెలుసా?

Actress Savitri: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర సంపాదించుకున్న మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోలు అందరూ సరసన నటించిన పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈమె కాల్ షీట్ల కోసం ఎదురు చూసేవారంటే ఈమెకు అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె రహస్యంగా జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహమైన తర్వాత ఈమె జీవితం పూర్తిగా మారిపోయింది. తాను సంపాదించిన దానిలో ఎంతో దానా ధర్మాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈమె చివరి క్షణాలలో మాత్రం దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని తెలుస్తోంది. ఇలా తనవాళ్లేనని నమ్మి ఉన్న ఆస్తులను మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా సినిమా అవకాశాలు రాకపోవడంతో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పూర్తిగా తాగుడుకు బానిసయ్యి చివరి క్షణాలను ఎంతో దుర్భరంగా గడుపుతూ తుది శ్వాస విడిచారు.

Actress Savitri: తన మొండి వైఖరి అందరినీ దూరం చేసిందా…

ఇలా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందిన ఈమె చివరికి ఏ ఒక్కరి సహాయ సహకారం తీసుకోలేదని చెప్పాలి.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను అందుకున్న సావిత్రికి చివరికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా సహాయం చేయలేదని తెలుస్తుంది. అయితే ఇలా వీరు సహాయం చేయకపోవడానికి ఒక కారణం ఉందని, అది కేవలం సావిత్రి మొండి వైఖరి కారణమంటూ ఇండస్ట్రీ టాక్.ఈమె తాగుడుకు బానిసైన సమయంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎన్నోసార్లు తను ఆ వ్యసనానికి దూరం కావాలని సూచించారట అయినప్పటికీ ఈమె తన మొండి వైఖరిని ఏమాత్రం మానుకోకపోవడంతో చివరి రోజులలో కూడా ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు కూడా ఆమెను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago