Movie News

Pawan Kalyan: పవన్ వెంట సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులు.. అర్ధరాత్రి గొడవకు దిగిన యువకులు?

Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా జనసేన అధినేతగా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.సాధారణంగా రాజకీయాలలో ప్రతి ఒక్కరికి ఎంతో మంది శత్రువులు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పట్ల కూడా పెద్ద ఎత్తున శత్రువులు ఉన్నారని ఆయన ప్రాణాలకు హాని ఉందంటూ జనసేన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pawan kalyan: పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న ఉంగరం ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ ప్రతి కదలికలను గుర్తుతెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారు అంటూ పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న వాహనం వెంట కొంతమంది వ్యక్తులు ఆయనని అనుసరిస్తూ అతని కదలికలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇలా ఆయన వెంట వెళ్లే వారంతా ఆయన అభిమానులు కాదంటూ నాదెండ్ల మనోహర్ తెలియ చేశారు.

Pawan Kalyan: పవన్ ఇంటి ముందు గొడవకు దిగిన యువకులు…

సోమవారం అర్ధరాత్రి సమయంలో కొందరి యువకులు ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కారును ఆపి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడ్డారని ఈయన వెల్లడించారు. ఇలా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సిబ్బందిని తీవ్ర అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా వారిపై గొడవకు దిగడంతో తప్పనిసరి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు నెంబర్లను గుర్తించి ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago