Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ యాంకర్ గా ఈమె తన వాక్చాతుర్యంతో అభిమానులను సందడి చేయడమే కాకుండా తన అందాల ఆరబోతతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా బుల్లితెర మహారాణిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.
ఈ విధంగా అనసూయ ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని నటిస్తున్నప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు రాలేదు అయితే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకేక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సందడి చేశారు.ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఇక వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీబిజీగా మారిపోయారు.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. అయితే అనసూయ సినిమాలలో నటిస్తున్నందుకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు సినిమా షూటింగులతో పాటు కమర్షియల్ యాడ్స్ అలాగే పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఈ విధంగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూనే పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా కూడబెట్టినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈమెకు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లో సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కూడా ఉందని అలాగే తన గ్యారేజ్ లో కాస్ట్లీ కారులు కూడా ఉన్నాయని సమాచారం. ఇలా అనసూయ ఆస్తులు మొత్తం సుమారు 30 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనసూయ భారీగానే ఆస్తులను పోగు చేసిందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…