Senior Journalist Imandhi Ramarao : చిరంజీవి గారిపై మాటలే కానీ ఒక్కరికి ప్రేమ లేదు…చిరంజీవి ని పట్టించుకోకుండా అవమానించారు…: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : స్వయం కృషి తో ఏ గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీ లో బయట ఎన్నో కోట్ల మంది అభిమానులు ఉండగా, ఇండస్ట్రీ లో కూడా ఆయన స్ఫూర్తి తో అడుగు పెట్టినవారు ఎందరో ఉన్నారు. ఇటీవలే చిరంజీవి గారి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53 వ ఎడిషన్ కు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు ను చిరంజీవి గారికి ప్రధానం చేసారు. ఒక తెలుగు వాడికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అయితే చాలా ఆశ్చర్యకరంగా సినిమా ఇండస్ట్రీ ఈ విషయంలో స్పందించలేదు, చిరంజీవి గారిని అభినందించలేదు ఇది అభిమానులకు చాలా నిరాశకు గురిచేసింది. ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు స్పందించారు.

చిరంజీవి గారికి అవమానం….

అంతటి ప్రతిష్టాత్మక అవార్డు చిరంజీవి గారికి వచ్చిన ఇండస్ట్రీ లో ఎవరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకారం అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న వాళ్లలో నూటికి తొంభై శాతం మంది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోనే సినిమాల్లోకి వచ్చాము అని చెప్తుంటారు. అవన్నీ ఒట్టి మాటలే నిజం అదికాదు అనేలా నేడు ప్రవర్తిస్తున్నారు. ఇక రాధిక గారు మాట్లాడుతూ చిరంజీవి ని ఒకరు పొగడాల్సిన పని లేదు అంటూ మాట్లాడారే కానీ ఆయనతో పాటు నటించిన సమాకాలిన నటులు కూడా ఆయనకు ఒక అభినందన సభ పెట్టాలని అనుకోలేదు అంటూ అభిప్రాయపడ్డారు.

ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వాళ్లయితే ఆయనకు అభినందనలు తెలిపాలని కానీ మనకు గర్వకారణమైన విషయం అని కానీ అనుకోవడం లేదు. ఇలాంటి ఇండస్ట్రీ కోసం చిరంజీవి కరోనా సమయంలో అంత కష్టపడి సేవ కార్యక్రమాలు చేశారా అనిపిస్తుంది. వీళ్ళందరిది చిరంజీవి మీద ఉన్నది కపట ప్రేమ అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.