ప్రముఖ ఓటీటీకి ‘మహాసముద్రం’.. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ సంస్థ..!

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిని ‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత అజయ్‌ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నా.

జగపతిబాబు, రావురమేశ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్‏తో ఏకే ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.

అందులో ఉన్న డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ నచ్చేశాయి. దీంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. దీనికి కథే హీరో అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదల అనంతరం ప్రముఖ ఓటిటి దిగ్గజం ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.

డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ మంచి డీల్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత దీనిని నెట్ ఫ్లిక్స్‏ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ‘మహాసముద్రం’ చిత్రానికి పోటీగా దసరా బరిలో మరో రెండు సినిమాలు దిగుతున్నాయి. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరియు నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రాలు అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.