Singer Sunitha : సౌందర్య గారు నన్ను ఏమని పరిచయం చేసేవారంటే… ఆ సినిమా నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చింది : సునీత

Singer Sunitha : సింగర్ సునీత ఉపధ్రష్ట ఎన్నో తెలుగు పాటలు పాడి సింగర్ గా అగ్ర స్థానంలో ఉంది. సౌత్ భాషల్లో పాటలు పాడి బాగా ఫేమస్ అయిన సునీత ఇక సినిమాల్లో డబ్బింగ్ చెప్పి కూడా అంతే ఫేమస్ అయింది. ఇక కేవలం ఆమె గాత్రమే కాకుండా రూపం కూడా చూడచక్కగా ఉండటం వల్ల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. కానీ సునీతకు సినిమాల్లో నటించే ఆసక్తి లేక అటు వైపు రాలేదు. ఇక 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సునీతకు ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో భర్త నుండి సునీత విడిపోయారు. ఇక ఒక వైపు పాటలు మరోవైపు డబ్బింగ్ చెబుతూ కెరీర్ లో దూసుకుపోయింది. భర్త తో విడిపోయి చాలా కాలం మరో పెళ్లి చేసుకోని సునీత, గతేడాది మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుంది.

సౌందర్య గారు అలా పరిచయం చేసేవారు…

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా దాదాపు 120 మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన సునీత సౌందర్య తో మొదలు నేటి నయనతార వంటి అగ్ర హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పింది. సౌందర్య గారికి డబ్బింగ్ చెప్పే సమయంలో సౌందర్య గారు ఎవరికైనా పరిచయం చేయాలంటే నేను సౌందర్య తాను నా గొంతు అంటూ పరిచయం చేసేవారని చెప్పారు సునీత. ఇక ఒక సినిమాలో కళ్యాణి, లయ ఇద్దరూ చేస్తున్నపుడు కళ్యాణి గారికి డబ్బింగ్ చెప్పకుండా లయ గారికి డబ్బింగ్ చెప్పానని ఆవిడ నాతో పోట్లాడారు. నాకు ఎపుడూ డబ్బింగ్ చెప్పేది నువ్వే కదా అలా కాకుండా వేరే హీరోయిన్ కి డబ్బింగ్ చెప్తావా అంటూ గొడవ పడింది.

చాలా ఏళ్లుగా డబ్బింగ్ చెప్పినా నాకు బాగా డబ్బింగ్ లో స్టార్ డమ్ వచ్చింది మాత్రం శేఖర్ ఖమ్ముల సినిమా ‘ఆనంద్’ తోనే అంటూ చెప్పింది సునీత. ఆ సినిమాలో వచ్చే ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యాను. అప్పుడే మొదటి సారి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు, అందరూ ఒక హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పేది సునీత అంటూ గుర్తించారు అంటూ చెప్పింది సునీత. ఇక ‘సుందర కాండ’ సినిమాలో ఛార్మి కి డబ్బింగ్ చెప్పినందుకు తాను ఒక పూల బుకే అలాగే ఒక లెటర్ పంపింది ఆది మర్చిపోలేను. ఇక ఏఎన్ఆర్ గారి ‘శ్రీరామ దాసు’ సినిమాలో స్నేహ కు డబ్బింగ్ చెప్పినపుడు నన్ను చాలా సందర్భాల్లో ప్రశంసించారు, అది మర్చిపోలేను అంటూ సునీత తన అనుభవాలను పంచుకున్నారు.