Nayanathara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది జూన్ నెలలో తన భర్తను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత నయనతార ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తనకు ఏ మాత్రం విరామం దొరికిన విదేశాలకు వెళ్తూ భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.
ఈ క్రమంలోనే నయనతార దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి ఈమె తన భర్త విగ్నేష్ పుట్టినరోజు కావడంతో తన భర్తకు సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. దుబాయిలో అత్యంత అందమైనటువంటి
బుర్జ్ ఖలీఫా దగ్గర తన భర్త పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇలా తన భర్త వేడుకలలో భాగంగా విగ్నేష్ తల్లి ఆయన సోదరుడు కూడా పాల్గొన్నారు.
ఇలా దుబాయ్ లో విగ్నేష్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఈయన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ పుట్టిన రోజు సందర్భంగా విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. స్వచ్ఛమైన ప్రేమను అందించి నా కుటుంబంతో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాను. నా ప్రియమైన వారందరితో కలిసి బుర్జ్ ఖలీఫా కింద నా భార్య కలలు కనే పుట్టినరోజు…ఇంతకన్నా గొప్పది ఏది ఉండదు ఇలా నా జీవితంలో ఆనందమైన క్షణాలను అందించినందుకు భగవంతునికి ధన్యవాదాలు అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ విధంగా నయనతార తన భర్తకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా వివాహం తర్వాత కూడా ఈమె సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…