Singer Sunitha: పాటే బంగారమాయనే..! సింగర్ సునీత సాంగ్ అలా ఉంది మరి.. !

Singer Sunitha: పాటే బంగారమాయనే..! సింగర్ సునీత సాంగ్ అలా ఉంది మరి.. !

Singer Sunitha: సింగర్ సునీత.. తెలుగు వారి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. గతంలో తన ఫ్యామిలీలో లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ… ప్రస్తుతం రెండో మ్యారేజ్ తరువాత చాలా హుషారుగా కనిపిస్తున్నారు. ఓ వైపు సింగింగ్ కెరీర్ కొనసాగిస్తూనే.. పలు షోలు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది.

Singer Sunitha: పాటే బంగారమాయనే..! సింగర్ సునీత సాంగ్ అలా ఉంది మరి.. !
Singer Sunitha: పాటే బంగారమాయనే..! సింగర్ సునీత సాంగ్ అలా ఉంది మరి.. !

దీంతో పాటు భర్త రామ్ వీరపనేని, సునీతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇటీవలే తన మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇటీవల నెట్టింట్లో వైరల్ గా మారింది. పెళ్లి తరువాత తన జీవితం ఏవిధంగా మారిందనే విషయాలతో పాటు.. భర్త రామ్ వీరపనేని గురించి పలు ఆసక్తికర విషయాలను  వెల్లడించింది.

Singer Sunitha: పాటే బంగారమాయనే..! సింగర్ సునీత సాంగ్ అలా ఉంది మరి.. !

దీంతో పాటు పలువురు కుటుంబ సభ్యులు సునీత, రామ్ వీరపనేని గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా మరో వీడియోతో సునీత ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. తన ఇంటిలో ఫార్మింగ్ చేస్తూ కనిపించింది. ఇటీవల సునీత అరటిగెళను కోస్తూ కనిపించగా… చెక్కర కేళీలా మీ పాటలు కూడా చాలా తీయగా ఉంటాయంటూ.. నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.


సునీత వ్యవసాయం పనులు చేస్తుంటే..

పలువురు నెటిజెన్లు సునీతకు నూతన సంవత్సర శుభాకంక్షలు తెలియజేశారు. ఫార్మింగ్ లో ఉన్న మాధుర్యం వేరే లెవల్ అంటూ  పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికీ వైరల్ అవుతుంది. మరోవైపు తాజాగా కూరగాయలు కోస్తూ కనిపించారు సునీత. వంకాయలు, ఆకుకూరలు కోస్తూ ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. సునీత వ్యవసాయం పనులు చేస్తుంటే పాటంత మాధుర్యంగా ఉందంటున్నారు. తనకు ఫార్మింగ్ అంటే ఇష్టమని.. కూరగాయలు కోయడమంటే మరీ ఇష్టమంటూ.. తన ఇష్టాలను నెటిజెన్లతో పంచుకుంటోంది. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సునీతపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.