Snigha : నా క్యాస్ట్ తో మీకు పనేంటి… నాకు లవ్ ప్రపోజ్ చేస్తే చెప్పేది ఒకటే….: యాక్టర్ స్నిగ్ధ

Snigdha : రాజమండ్రి లో పుట్టి పెరిగిన స్నిగ్ధ టామ్ బాయ్ ల కనిపిస్తు సింగర్ గా ఇండస్ట్రీ కి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అలా మొదలయింది సినిమాలో నందిని రెడ్డి స్నిగ్ధ ను హీరోయిన్ ఫ్రెండ్ పాత్రకు అడగడంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన స్నిగ్ధ ఆ తరువాత యాభై కి పైగా సినిమాల్లో నటించారు. నటించడం ఇప్పటికీ రాదు అంటూ చెప్పిన స్నిగ్ధ తన వేష ధరణ అబ్బాయిల ఉండటం గురించి క్లారిటీ ఇచ్చారు. చిన్నప్పటి నుండి సింగింగ్ అంటే ఇష్టమున్న స్నిగ్ధ సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా కూడా కొన్ని పాటలను పాడటం విశేషం. ఇక తన జీవితంలో కిరణ్ బేడీ వంటి వారు తనకు ఆదర్శమంటూ చెప్తోన స్నిగ్ధ తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.

నా క్యాస్ట్ తో మీకు పనేంటి….

ఇంటర్వ్యూ లో తన వస్త్ర దారణ అబ్బాయి లాగా ఉండటానికి గల కారణాలు చెబుతూ అమ్మాయిల బట్టలు వేసుకుంటాను అయితే ప్యాంటు, షర్ట్ వేసుకోవడం లో కంఫర్ట్ ఉంటుంది అందుకే అలా నా వేష ధారణ ఉంటుంది ప్రత్యేకించి మరో కారణం లేదు అంటూ చెప్పారు. ఇక బాయ్ కట్ నాకిష్టం ఎంత వీలైతే అంత సింపుల్ గా ఉండాలని భావిస్తాను అంటూ చెప్పారు. ఇక క్యాస్ట్ గురించి ప్రస్తావన రాగా నా క్యాస్ట్ గురించి ఎవరికైనా ఎందుకు నా చదువు అయ్యేవరకు కూడా క్యాస్ట్ గురించి తెలియదు. అది సమాజంలో దేనికి ఉపయోగపడుతుందో కూడా ఇప్పటికీ నాకు అర్థం కాదు నేను క్యాస్ట్ పట్టించుకోను అంటూ చెప్పారు. ఇక ఇండస్ట్రీ లో బ్రాహ్మణ కులం వారికే సింగర్ గా అవకాశాలు ఇస్తారు కానీ మిగతా వారిని తొక్కేస్తారు అన్న మాటలకు స్నిగ్ధ మాట్లాడుతూ నేను విన్నాను కానీ ఇలాంటివి క్యాస్టింగ్ కౌచ్ వంటివి ఒక్క సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నాయని ఆపాదించడం తప్పు అన్ని రంగాల్లోను ఉన్నా అవి బయటకు రావడం లేదు.

ఇక క్యాస్ట్ ను బట్టి అవకాశాలు కొంతమంది అలా చేస్తారేమో అందరూ కాదు అంటూ అభిప్రాయపడింది. ఇక కాలేజీ రోజుల్లో ప్రపోజ్ చేసారు. ఇక ఇప్పుడు కూడా కొంతమంది ప్రపోజ్ చేస్తారు. నేను వారికి చెప్పేది ఒకటే నీకు జీవితం మీద ఆశ ఉంటే ఇక్కడితో వదిలేయ్ ఈ విషయంలో అని చెప్తా అంటూ పంచుకున్నారు. పెళ్లి మీద ఆసక్తి లేదని చెప్పారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వారి బాగోగులు చూస్తూ వారికి సమయం కేటాయించగలగాలి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అలా చేయలేనపుడు కనకూడదు. కానీ గాలికి వదిలేస్తే సమాజానికి ప్రమాదం అందుకే నేను వాటి జోలికి పోదల్చుకోలేదు అంటూ పెళ్లి, పిల్లల మీద తన అభిప్రాయాలను తెలిపారు.