Un Stoppable: సినీ నటుడు,తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం మంచి విజయం కావడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమం మొదటి సీజన్ కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించి బాలకృష్ణ తనదైన శైలిలో వారిని ప్రశ్నిస్తూ వారితో కలిసి సందడి చేశారు. రెండవ సీజన్ మాత్రం ఇందుకు భిన్నంగా రాజకీయ నాయకులను కూడా ఈ వేదిక పైకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ రావడంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య టాక్ షో కి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా ఈ కార్యక్రమానికి షర్మిల ముఖ్య అతిథిగా రాబోతున్నారని తెలియడంతో ఈ ఎపిసోడ్ పై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో ఎంతవరకు ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం షర్మిల తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటూ తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని గత కొన్ని నెలలుగా షర్మిల ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు బాలయ్య టాక్ షో నుంచి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. ఒకవేళ ఈమె కనుక ఈ షోకి వస్తే బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు వేస్తారు జగన్ తో తనకు మనస్పర్థలు ఉన్నాయనే వార్తలకు ఈ కార్యక్రమం ద్వారా సమాధానం దొరుకుతుందా..అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఆహా ఏమి ప్లాన్ చేశారు అంటూ నిర్వాహకులపై కామెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…