Tag Archives: accident arguments

సాయి ధరమ్ తేజ్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ టీవీ9 జర్నలిస్ట్ మధ్య వాగ్వాదం.. ట్వీట్స్ వైరల్..

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి ధరమ్ ను ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స కోసం దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి తరలించగా అనంతరం అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలో అతన్ని పరీక్షించిన వైద్యులు అంతర్గత గాయాలివే కాకపోవడంతో ఎలాంటి ప్రమాదం లేదని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియజేస్తున్నారు.

ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సూచిస్తున్నప్పటికీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం అతని ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారంటూ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు కథనాలు రాస్తూన్నటువంటి మీడియా పై తీవ్రస్థాయిలో ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్ హాట్సాఫ్ బ్రదర్… నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు రాతలు రాస్తూ ఆ వార్తలను అమ్ముకొని బతుకుతున్న అందరూ బాగుండాలి వారికి ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నా అంటూ ట్విట్టర్ వేదికగా పలు మీడియా సంస్థలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ట్వీట్ కి టీవీ9 జర్నలిస్ట్ దొంతు రమేష్ స్పందిస్తూ ఆయన ట్వీట్ కు రీట్వీట్ చేశారు.

ఈ మధ్యకాలంలో మీడియా వాళ్ళని విమర్శించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.. తప్పుడు కథనాలతో హింసను ప్రేరేపిస్తూ సినిమాలు తీసి మీరు కోట్లు సంపాదించవచ్చు కానీ, మేము వార్తలు రాస్తే మాత్రం తప్పుడు వార్తలు అంటూ ప్రచారం చేస్తారు. మీరు అతివేగంతో వెళ్లి ప్రమాదానికి గురి కావడమే కాకుండా మరికొందరు ప్రాణాలను కూడా ముప్పు తెస్తున్నారంటూ రమేష్ హరీష్ శంకర్ ట్వీట్ కి బదులిచ్చారు.

ఈ క్రమంలోనే హరీష్ శంకర్ స్పందిస్తూ నేను “తప్పుడు వార్తలు” రాసే వారికి అంటూ క్లియర్ గా చెప్పాను. మరి మీరు ఎందుకు అనవసరంగా భుజాలు తడుముకున్నారు అంటే.. మీరు తప్పుడు రాతలు రాస్తున్నట్లు ఒప్పుకున్నట్లే కదా అంటూ హరీష్ శంకర్ వెల్లడించారు. మేము హింసాత్మక చిత్రాలను చేస్తే మాకు సెన్సార్ ఉందిమేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాము మరి మీరు ఎవరికీ సమాధానం చెప్పుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నేను మీ వ్యవస్థను తప్పు పట్టడం లేదు మీ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాను అంటూ ఈ విధంగా హరీష్ శంకర్ టీవీ9 జర్నలిస్ట్ రమేష్ మధ్య సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ ట్వీట్స్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.