Tag Archives: akkineni nageswara rao

Murali Mohan: ఆమె శ్రీదేవిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు… మురళీమోహన్ కామెంట్స్ వైరల్!

Murali Mohan: మురళీమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తే సందడి చేస్తున్నారు. అయితే ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు.కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రలలో నటించారు అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో అనంతరం రాజకీయాలలోకి వచ్చి కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తనకు సినిమాలే కరెక్ట్ అని భావించిన మురళీమోహన్ ఇప్పటికీ సినిమాలలో కొనసాగుతున్నారని ఇకపై తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మురళీమోహన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.ఇండస్ట్రీలో తనను అందరూ శ్రీరామచంద్రుడు అని భావించేవారు. ఇక ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో మీరు మాత్రమే శ్రీరామచంద్రుడు అంటూ తనకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని తెలిపారు.తన గురించి ఇండస్ట్రీలో ఇలాంటి అభిప్రాయం ఉండడంతో శ్రీదేవి తల్లిగారు ఏకంగా తనకు అల్లుడుగా చేసుకోవాలని భావించారని ఈయన తెలిపారు.

Murali Mohan: అమ్మాయి సంతోషంగా ఉంటుందని…


ఆమె తనని చూసి చాలా మంచివాడు గుణవంతుడుగా ఉన్నారని ఇలాంటి అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురు చాలా సంతోషంగా ఉంటుందని భావించి ఏకంగా శ్రీదేవితో నాకు పెళ్లి చేయాలని చూశారు అంటూ ఈ సందర్భంగా మురళీమోహన్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kadambari Kiran : ఏఎన్ఆర్ చనిపోయే ముందు అయన కాళ్ళు ముట్టుకుంటే చర్మం ఊడొచ్చేది.. అందుకే ఎవరినీ.. – కాదంబరి కిరణ్

Kadambari Kiran : సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది నటీనటులు వస్తుంటారు వెళుతుంటారు. కానీ కొందరి గురించి మాత్రం కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకొనే సెలబ్రిటీలలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు.అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇప్పటికే అక్కినేని సినిమాలు టీవీలో ప్రసారం అయితే కన్ను తిప్పకుండా చూసే ప్రేక్షకాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

తెలుగు సినిమా పైఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగేశ్వరరావు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన కొడుకుతో కూడా కలిసి తెరపై సందడి చేశారు. నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జున తో కలిసి ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలలో నటించారు. అదేవిధంగా కుటుంబం అంతా కలిసి చివరిగా మనం అనే సినిమాలో నటించారు. నాగేశ్వరరావు చివరిగా మనం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఎన్నో విభిన్నమైన కథలలో నటించిన నాగేశ్వరరావు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ఈ విధంగా చివరివరకు సినిమాలలో నటిస్తూ చివరి రోజుల్లో క్యాన్సర్ బారినపడి చికిత్స తీసుకుంటూ నాగేశ్వరరావు మృతి చెందారు. సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావుకు ఎంతో అమితమైన వ్యక్తిగా నటుడు, కమెడియన్ కాదంబరి కిరణ్ అన్ని వేళల అక్కినేని గారిని అంటిపెట్టుకుని ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన గురించి తెలియజేశారు.

కిరణ్ ఎన్నో సినిమాలలో నటుడిగా సహాయనటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మనం సైతం అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే మా అసోసియేషన్ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఏఎన్నార్ గారు చివరి రోజుల్లో అతని పక్కనే ఉన్నానని అతనిని చూడటానికి ఎవరిని కూడా లోపలికి పంపించేవారు కాదు అని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఏఎన్ఆర్ అనారోగ్యం కారణంగా అతని కాళ్లు పట్టుకుంటే చర్మం ఊడొచ్చేది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఏఎన్నార్ గారి ఆరోగ్యం ఉండేదని, అతని చివరి రోజుల్లో తన పక్కన నేనున్నానని ఈ సందర్భంగా కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.

Jayamalini : ఆ హీరో నన్ను చెడ్డది అన్నారు.. నా నడుముకు రెండు వైపులా చేయి వేసి ఏంటి నీది ఇంత పెద్దగా ఉందన్నారు : జయమాలిని

ఆ రోజుల్లో కుర్రాళ్ల మనసులో ఆమె ఒక కళల రాణి. దివినుండి భువికి దిగివచ్చిన అప్సరస,అతిలోక సుందరి.కుర్రాళ్ళ కాలేజీ పుస్తకాలు, పర్స్ లు తెరిచి చూస్తే ఆమె ముగ్ధ మనోహర రూపం దర్శనమిచ్చేది. నిద్రలో వచ్చే కళలు సైతం మరిపించి ఇది నిజమా అన్న భ్రమలోకి తీసుకెళ్ళిన అరుదైన సుందర రూపం ఆమె సొంతం.

దాదాపు ఆమె నటించి, నర్తించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఓ సందర్భంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు రానటువంటి జనం జయమాలిని షూటింగ్ చేస్తున్నప్పుడు తండోపతండాలుగా రావడం ఎన్టీ రామారావు గారిని ఆశ్చర్యానికి గురి చేసింది. తలుపులకు తాళం వేసి షూటింగ్ జరుగుతుంటే కుర్రకారు ఎగబడి చూసేవారు.

ఓ సుబ్బారావు..ఓ అప్పారావు.. నీ ఇల్లు బంగారం గాను.. గుడివాడ వెళ్లాను.. గుంటూరు వెళ్లాను.. సన్నజాజులోయ్.. లాంటి కైపెక్కించే వందలాది పాటలకు నర్తించి కుర్రకారు మతులు పోగొట్టి వారి గుండెల్లో జెండా పాతిన ఆనాటి క్లబ్ డాన్సర్ జయమాలిని. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని మాట్లాడుతూ.. అలనాటి స్టార్ హీరో అయినా అక్కినేని నాగేశ్వరావుతో ఆలుమగలు, రాముడు కాదు కృష్ణుడు, బహుదూరపు బాటసారి, సంగీత సామ్రాట్ వంటి చిత్రాలలో ఆయన సరసన నర్తించడం జరిగిందని ఆమె చెప్పారు. అలా ఒక రోజు షూటింగ్ చేస్తున్న క్రమంలో అక్కినేని తన భార్యతో షూటింగ్ కి హాజరయ్యారు…ఆయనను చూడగానే నమస్కారం పెట్టాను.. అటు వెళ్తున్న నన్ను చూసి జయమాలిని ఆగు అని పిలిచారు. మా ఆవిడ నిన్ను చెడ్డ అమ్మాయి అని అంటుందన్నారు.

నేను కాదు ఆవిడ అలా అంటున్నారన్నారు. అప్పుడు నేను చిన్నగా చిరునవ్వు నవ్వాను. ఆయన ఎప్పుడూ లొకేషన్లో అల్లరి చేస్తుండేవారని అలాగే అక్కినేని, నేను ఓ పాటలో డాన్స్ చేస్తున్నప్పుడు ఆయన నా నడుమును రెండు చేతులతో పట్టుకున్నారు. ఏమిటి మీ నడుము ఇంత పెద్దగా ఉంది, నా రెండు చేతులకు కూడా అందడం లేదన్నారు. అక్కడే ఉన్న మరో నటుడు గిరిబాబు కలిపించుకొని జయమాలిని అలా అడుగుతారేంటి ఆ విషయం వాళ్ళ అమ్మానాన్నని అడగాలన్నారు. అలా అనేసరికి నేను అవాక్కయ్యాను. అప్పుడు షూటింగ్స్ అన్నీ కూడా సరదాగా సాగిపోయేవన్నారు. అక్కినేని మంచి డాన్సర్ అని “ఆలుమగలు” చిత్రంలో “రా రా రంకె వేసిందమ్మో రంగ అయినా పోట్ల గిత్త “… అనే పాటలో ఆయన అద్భుతంగా డాన్స్ చేశారని. అప్పుడున్న నటుల్లో అక్కినేని, ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన చిరంజీవి మంచి డాన్సర్స్ అని ఆ ఇంటర్వ్యూలో ఆనాటి జ్ఞాపకాలను జయమాలిని గుర్తు చేసుకున్నారు.

ANR – MB : ఒకే టైటిల్ తో వచ్చిన అక్కినేని, మహేష్ బాబు చిత్రాలు ఎలా ప్రదర్శింపబడ్డాయో చూడండి.!!

1971 జగపతి ఆర్ట్ పిక్చర్స్ లో “దసరా బుల్లోడు” లాంటి బ్లాక్ బస్టర్ లో నటించి మంచి స్వింగ్ లో ఉన్న అక్కినేనికి వెంటనే అనేక చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అంతకుముందే విజయా సంస్థలో వచ్చిన “గుండమ్మ కథ” చిత్రంలో అక్కినేని-జమున బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ఆ తర్వాత అక్కినేని-జమున మరోసారి తెర మీద కనిపించారు.

ఆతర్వాత జమున 1971లో చలంతో “మట్టిలో మాణిక్యం” అనే విజయవంతమైన చిత్రంలో నటించారు. అటు అక్కినేని ఇటు జమున ఇద్దరూ హిట్ చిత్రాల్లో నటించి మంచి జోష్ లో ఉన్నారు.

అలా వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వచ్చింది. 1971 విశ్వభారతి ప్రొడక్షన్స్,ప్రత్యగాత్మ దర్శకత్వంలో “శ్రీమంతుడు” చిత్రం విడుదల అయ్యింది. అక్కినేని, జమున హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి తాతినేని చలపతిరావు సంగీత సారథ్యంలో “బులి బులి ఎర్రని బుగ్గల దానా.. చెంపకు చారెడు కన్నుల దాన మారిపోయావా.. అనే పాట ఆ రోజుల్లో ప్రజాదరణ పొందిన పాటగా చెప్పవచ్చు. గుమ్మడి, రమణారెడ్డి, రాజబాబు, సూర్యకాంతం లాంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిపోయింది..

ఇక కొరటాల శివ సందేశాత్మక కథలను కమర్షియల్ పంథాలో తెరకెక్కించగల సమర్థుడైన దర్శకుడు. అలా ప్రభాస్ నటించిన “మిర్చి” సినిమా అనంతరం మహేష్ బాబుతో మరో సినిమా నిర్మించారు. 2015 మైత్రి మూవీ మేకర్స్,కొరటాల శివ దర్శకత్వంలో “శ్రీమంతుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆగర్భ శ్రీమంతుడు మహేష్ బాబు ఊరి కోసం తన ప్రేమను, కోట్ల రూపాయల ఆస్తిని కాదనుకొని ఉత్తరాంధ్రలోని దేవరకోట ఊరిని దత్తత తీసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్న ఎంపి సోదరుడు చేసే అక్రమాలను అడ్డుకుంటారు. పల్లె కోసం ప్రతికూల పరిస్థితులలో సైతం మహేష్ బాబు కృషిచేస్తాడు.

ఒకసారి అవినీతి మూకల హత్యాప్రయత్నం నుండి మహేష్ బాబు బయట పడతాడు. చివరికి ఊరును అభివృద్ధి చేసి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. కోట్లరూపాయల వ్యాపారం పక్కన పెట్టి, గ్రామ క్షేమం కోసం మహేష్ బాబు పాటుపడడంతో శృతిహాసన్ ఇంకా ఆయనను ప్రేమిస్తుంది. అలా చివరికి ఊరికి అన్యాయం చేసే ఎంపి సోదరులను కడతేర్చి మహేష్ బాబు పల్లెకు న్యాయం చేస్తాడు. దేవిశ్రీ సంగీత సారధ్యంలో వచ్చిన పోరా శ్రీమంతుడా పో.పో.. పోరా శ్రీమంతుడా.. అనే పాట సినిమాకి హైలెట్ గా చెప్పవచ్చు. కమర్షియల్ హంగులతో సందేశాత్మకంగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రభావంతో గ్రామాలను దత్తత తీసుకోవడం అనే అంశం బహుళ ప్రజాదరణ పొందింది.

ఎన్టీఆర్ సినిమాలోని ఆ పాట లిరిక్స్ కి సెన్సార్ అభ్యంతరం చెప్పిందని మీకు తెలుసా?

సాధారణంగా ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత ఆ సినిమాను సెన్సార్ బోర్డు పర్యవేక్షించి అందులో ఏవైనా అసభ్యకర పదజాలం, అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటే ఆ సన్నివేశాలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలియజేస్తుంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన తర్వాతనే ఏ సినిమా అయినా విడుదల కావాల్సి ఉంటుంది. ఇలా నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన ఒక సినిమా లోని పాట లిరిక్స్ కి సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఏంటి?ఏ పాటకు సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది అనే విషయానికి వస్తే..

కె రాఘవేంద్రరావు నిర్దేశకత్వంలో రోజా మూవీస్ బ్యానర్ పై ఎం అర్జున రాజు నిర్మించిన “వేటగాడు” సినిమాలో నందమూరి తారక రామారావు శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలోని ఎవర్ గ్రీన్ పాటగా పేరు సంపాదించిన “ఆకుచాటు పిందె తడిచే” అనే పాట ఎంతో ఫేమస్ అయ్యింది. రాఘవేంద్ర రావు వాటర్ స్పీకర్లను ఉపయోగించి మూడు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత వర్షం వస్తే అందరి నోటా ఇదే పాట మేదిలేది.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళినప్పుడు ఈ పాటను ఎంతో ఎంజాయ్ చేసిన సెన్సార్ సభ్యులు “ఆకుచాటు పిందె తడిచే” తరువాత వచ్చే “కోకమాటు పిల్ల తడిసే” అనే పదానికి సెన్సార్ అభ్యంతరం తెలిపింది. ఆ సౌండ్ కట్ చేయాలి లేదంటే మరొక పదం అక్కడ రీప్లేస్ చేయాలని చెప్పారు. అదే సమయంలో ఏడిద నాగేశ్వరరావు ఆఫీసులో వేటూరి “శంకరాభరణం” సినిమాకు పాటలు రాస్తున్నారు.

ఈ క్రమంలోనే వేటగాడు సినిమాకు సెన్సార్ అభ్యంతరం చెప్పింది అనే విషయం తెలుసుకున్న వేటూరి ఒక ఐదు నిమిషాల పాటు ఆలోచించి “కోకమాటు పిల్ల తడిచే” మాటల స్థానంలో కొమ్మ చాటు పువ్వు తడిసే అని మాటలు రాసి పంపించడంతో అప్పటికప్పుడు ఆ పదానికి బిట్ తో ఆ పాటను చక్రవర్తి రికార్డు చేసి పంపడంతో సెన్సార్ ఏ విధమైనటువంటి అభ్యంతరం చెప్పలేదు. అలా 1979 లోవిడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ సినిమాలోని ఈ పాట సూపర్ హిట్ అయ్యింది.

అక్కినేని నాగేశ్వరరావు సినిమా షూటింగులో అనుకోని ప్రమాదం.. నీళ్లలో కొట్టుకుపోయిన శారదా డూప్!

సాధారణంగా సినిమా షూటింగ్ జరిగే సమయాలలో కొన్నిసార్లు ప్రమాదాలు తలెత్తడం సర్వసాధారణమే. ముఖ్యంగా కొన్ని ప్రమాదకరమైన సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో హీరోహీరోయిన్లకి బదులుగా వారి డూప్ లతో సినిమాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విధంగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగామధుసూదన్ రావు దర్శకత్వం వహించిన “అమాయకురాలు” అనే చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శారద టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో అనుకోని ప్రమాదం జరిగే శారదకు డూప్ గా నటిస్తున్నటువంటి ఆమె నీళ్లలో కొట్టుకుపోవడంతో చిత్రబృందం మొత్తం కంగారు పడ్డారు.

కథ ప్రకారం విలన్ రెండవ పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం ఆమెను చంపాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే శారదను పిక్నిక్ తీసుకువెళ్లి నీళ్ళల్లో తోసే సన్నివేశాన్ని చిత్రీకరించాలి. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం కోసం చిత్ర బృందం కేరళలోని త్రివేండ్రం దగ్గరలో ఉన్న అరువికెరా డ్యామ్‌కు వెళ్లారు. అయితే శారదకు ఈత రాకపోవడం వల్ల ఆమె స్థానంలో ఒక మళయాళీ అమ్మాయి డూప్ గా నటించారు.

అయితే ఆమె నడుముకి రెండు తాళ్ళు కట్టి అవి కనపడకుండా నీటిలో వదిలేసి ఇద్దరు సెట్ బాయ్ లను ఆ తాళ్లను గట్టిగా పట్టుకొమ్మని చెప్పారు. డైరెక్టర్ స్టార్ట్ కెమెరా అనగానే డ్యామ్ కున్న 6 లాకర్స్ తెరుచుకొని ఎక్కువ మొత్తంలో నీటి ఉధృతి వచ్చింది. అదే సమయంలో కెమెరాలో తాళ్లు పట్టుకున్న సెట్ బాయ్స్ కనిపించడంతో డైరెక్టర్ గట్టిగా అరిచారు. ఈ క్రమంలోనే వారు ఉలిక్కిపడి తాళ్లని వదిలేయడంతో శారద డూప్ లో నటిస్తున్నటువంటి అమ్మాయి సుమారు 200 గజాల దూరం వరకు కొట్టుకుపోయింది.

ఈ విధంగా ఆ నీటి ఉధృతిలో అమ్మాయి కొట్టుకుపోతుంటే యూనిట్ సభ్యులు ఎంతో కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆమెను పట్టుకోవాలని నీళ్లలోకి దూకినప్పటికీ వీలు కాలేదు. ఈ క్రమంలోనే స్థానిక ఇద్దరు యువకులు నీళ్లలో దూకి వారిద్దరిని ఒడ్డుకు చేర్చారు. అయితే శారద డూప్ లో నటిస్తున్నటువంటి మలయాళి అమ్మాయికి కూడా ఈత రాకపోయినప్పటికీ ఈత వచ్చని చెప్పడం, డైరెక్టర్ డ్యామ్ 4 లాకర్లు తెరవమంటే ఆరు తెరవడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని ఆ తర్వాత తెలిసింది.