Tag Archives: allu sneha

Allu Sneha: అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు.. ఒక్క ఫోటోతో క్లారిటీ చేసిన స్నేహ రెడ్డి… ఫోటో వైరల్!

Allu Sneha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి కుటుంబాలలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటి అని చెప్పాలి.ఈ రెండు కుటుంబాలకు ఎంతో అద్భుతమైన సినీ బ్యాగ్రౌండ్ ఉంది అయితే ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీలో భాగంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు త్రిబుల్ ఆర్ టీమ్ మొత్తానికి చిరంజీవి సన్మానం చేశారు.ఇలా చరణ్ పుట్టినరోజు వేడుకలకు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా కదిలి వచ్చారు కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు.ఇక అల్లు అర్జున్ కనీసం సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ఈ వార్తలకు బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి ఒకే ఒక్క వీడియో, ఫోటోతో ఈ వార్తలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం బన్నీ తన ఫ్రెండ్ పుట్టినరోజు వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లారు. అయితే బన్నీ ఫ్యామిలీతో పాటు కొణిదెల సుస్మిత,శ్రీజ ఇతర స్నేహితులు కూడా ఈ వెకేషన్ కు వెళ్లారు. ఇలా వీరందరూ కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఫోటోలతో పాటు వీడియోని కూడా షేర్ చేశారు.


Allu Sneha: లవ్ ఫ్యామిలీ….


ఇలా ఈ వీడియోని షేర్ చేస్తూ లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ జోడించారు.ఒకవేళ ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు కనుక ఉంటే బన్నీ కేవలం తన ఫ్యామిలీతో మాత్రమే వెళ్లే వారని మెగా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తీసుకొని వెళ్లరు అంటూ అల్లు ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా స్నేహారెడ్డి ఫోటోలు వీడియోల ద్వారా రెండు కుటుంబాల మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.

ఫ్యామిలీతో దుర్గం చెరువు ఫ్లైఓవర్ పై సందడి చేసిన బన్నీ.. వీడియో వైరల్!

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లుఅర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం విరామం దొరికినా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లడానికి ముందుంటారు. ఈ క్రమంలోనే వీలు దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా తన భార్య పిల్లలతో కలిసి అల్లుఅర్జున్ మరోసారి బయట సందడి చేశారు.

ప్రస్తుతం కరోనా కారణం వల్ల, విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈసారి సిటీ లోనే తన పిల్లలతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని దుర్గం చెరువు ఫ్లైఓవర్ పై బన్నీ స్వయంగా కారు నడుపుతూ లాంగ్ డ్రైవ్ వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నేహ రెడ్డి చిత్రీకరించి ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. మై సిటీ అని క్యాప్షన్ తో పాటు, హైదరాబాద్, లాంగ్ డ్రైవ్ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించారు. అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే.

ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో భార్యకు లేనంత ఫాలోయింగ్ స్నేహరెడ్డికి ఉందని చెప్పవచ్చు. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 4.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.అల్లు స్నేహ ఎప్పుడు తన కుటుంబానికి తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా అల్లు స్నేహ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చెల్లిని భుజాన ఎత్తుకున్న అల్లు అయాన్.. క్యూట్ ఫోటో!

సోషల్ మీడియాలో సెలబ్రిటీ కుటుంబాలు ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కుటుంబం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, స్నేహ రెడ్డి సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఏ సెలబ్రిటీ భార్యకు లేని ఫాలోయింగ్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సంపాదించుకున్నారు. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని రికార్డ్ క్రియేట్ చేశారు.

స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తన పర్సనల్ విషయాలను, తన కూతురు అర్హ కొడుకు అయాన్ లకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అయాన్ ,అల్లు అర్హ చేసే అల్లరి పనులు, చిలిపి చేష్టల గురించి ఎప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అదేవిధంగా ఈ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించి గతంలో ఎన్నోసార్లు అభిమానులకు తెలియజేశారు.ఓసారి అల్లు అయాన్ తన బుల్లి చెల్లిని బండి పై ఎక్కించుకొని ఇల్లు మొత్తం చక్కర్లు కొట్టినటువంటి వీడియోను స్నేహ అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా ఇప్పుడు ఆయాన్ తన చెల్లిని ఏకంగా భుజాలపై ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఈ విధంగా ఈ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న బంధాన్ని స్నేహ రెడ్డి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.