సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లుఅర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం విరామం దొరికినా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లడానికి ముందుంటారు. ఈ క్రమంలోనే వీలు దొరికినప్పుడల్లా తన భార్య పిల్లలతో కలిసి ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా తన భార్య పిల్లలతో కలిసి అల్లుఅర్జున్ మరోసారి బయట సందడి చేశారు.
ప్రస్తుతం కరోనా కారణం వల్ల, విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈసారి సిటీ లోనే తన పిల్లలతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని దుర్గం చెరువు ఫ్లైఓవర్ పై బన్నీ స్వయంగా కారు నడుపుతూ లాంగ్ డ్రైవ్ వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్నేహ రెడ్డి చిత్రీకరించి ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. మై సిటీ అని క్యాప్షన్ తో పాటు, హైదరాబాద్, లాంగ్ డ్రైవ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను జోడించారు. అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే.
ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో భార్యకు లేనంత ఫాలోయింగ్ స్నేహరెడ్డికి ఉందని చెప్పవచ్చు. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 4.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.అల్లు స్నేహ ఎప్పుడు తన కుటుంబానికి తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా అల్లు స్నేహ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…