అశ్లీల చిత్రాలను తీస్తూ.. వాటిని యాప్ లో అప్లోడ్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త… బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తన భర్త అరెస్ట్ అయిన తరువాత శిల్పాశెట్టి ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.
తాజాగా శిల్పాశెట్టి సోషల్ మీడియా వేదికగా మొదటిసారిగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆమె గురువారం రాత్రి ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఇందులో ప్రస్తుతం మమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులపై.. మేము అనుభవిస్తున్న టువంటి దురదృష్టం.. చిరాకుపై మేము తిరిగి కోపాన్ని చూస్తాము. ప్రస్తుతం మేము మా ఉద్యోగాలను కోల్పోవచ్చు, లేదా ప్రియమైన వ్యక్తులను కోల్పోవచ్చు అయితే అందరం ఉండాల్సింది ఇక్కడే.
ప్రస్తుతం ఏం జరిగిందో.. ఏం జరుగుతుందో అని ఆత్రుతగా ఎదురు చూడటం లేదు. జరుగుతున్నది మాత్రం పూర్తిగా నాకు తెలుసు. ఇప్పటి వరకు గతంలో వచ్చిన సవాళ్లను తట్టుకున్నాను.. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఈ జీవితాన్ని గడపడం కోసం మనం ఏది మార్చుకోవాల్సిన పనిలేదని తెలిపారు.
ప్రస్తుతం శిల్పా శెట్టి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో షేర్ చేయడంతో శిల్పాశెట్టి ప్రస్తుత తన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుపుతూ ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో శిల్పాశెట్టి తన భర్త కు మద్దతుగా నిలబడతారా.. లేక వ్యతిరేకంగా పోరాడుతారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…