Tag Archives: amazon

Kantara Movie: ఓటీటీ విడుదలకు సిద్ధమైన కాంతార.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kantara Movie: కాంతార ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా పేరు మారుమోగిపోతుంది.కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వందల కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ విధంగా కాంతార సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నవంబర్ 4వ తేదీని ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమవుతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై నిర్మాత స్పందించి ఇప్పుడే ఈ సినిమాని డిజిటల్ మీడియాలో ప్రసారం చేయబోమంటూ వెల్లడించారు.

తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ మీడియా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని నవంబర్ 18 వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Kantara Movie: అమెజాన్ లో సందడి చేయనున్న కాంతార…


ఈ సినిమా కన్నడ భాషలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అదేవిధంగా ఈ సినిమా తెలుగులో అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 45 రోజులు అనంతరం ఈ సినిమాని నవంబర్ 18 వ తేదీ అమెజాన్ లో ప్రసారం చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది.

అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో గంజాయి కూడా దొరుకుతుంది..! వీళ్లు చేసేది తెలిసి షాక్..

ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కువగా పాపులర్ అయినవి అమెజాన్, ప్లిఫ్ కార్టు. వీటి ద్వారా నిత్యావసర సరుకులతో పాటు, గాడ్జెస్, విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ మరియు ఇంటి సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో కూర్చొని ఆ సంస్థల వెబ్ సైట్ కి వెళ్లి బుక్ చేసుకుంటే.. ఇంటికే డెలివరీ అయిపోతాయి. వీటికి ఒక ఆఫీస్ అంటూ ఏం ఉండదు.

అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది. అయితే ఇక్కడ అమెజాన్ లో ఇవన్నీ కాకుండా గంజాయి కూడా దొరుకుతుందట. కొంతమంది ఎవరికీ తెలియకుండా.. అనుమానం రాకుండా ఆన్‌లైన్‌లో సేవల ద్వారా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల పోలీసులు ఇలా అమెజాన్ ఆన్ లైన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అస్సలు ఎలా జరుగుతుంది.. ఎక్కడ నుంచి జరుగుతోంది అనే విషయాలను రాబట్టారు పోలీసులు.

విశాఖపట్టణం కేంద్రంగా మధ్యప్రదేశ్‌కు గంజాయిని సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాలను మధ్యప్రదేశ్ పోలీసులకు చేరవేయగా అక్కడ బెండీలో కేసు నమోదు చేశారు. అక్కడ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నేడు విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని ఓ ఆన్ లైన్ స్టోర్ లో.. కాఫీ పొడి, కరివేపాకు పొడి పేరుతో డబ్బాల్లో గంజాయి పెట్టి.. గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

అందులో కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వాళ్లు పార్సల్ రూపంలో ఇస్తుంటే.. వాటిని శ్రీనివాస్‌ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.

వామ్మో.. అతడు ఇంకా బతికి ఉన్నాడా.. ఈ ఘటన అలాంటిది మరి..

నిజంగానే కొన్ని ఘటనలు చూసినా.. అలాంటి ఘటనలు విన్నా బాప్ రే అని అనిపిస్తుంటుంది. అవి నమ్మడానికి వాస్తవంగా అనిపించవు. ఇలాంటివి ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో చూస్తుంటాం. లేదంటే క్రూర జంతువుల చెరలో చికుక్కున్న మనుషుల కథలు చదివినిప్పుడు అనిపిస్తుంది.

అయితే అలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. దాని గురించి తెలుసుకుందాం.. అతడికి 33 ఏళ్లు. యూఎస్‌లోని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో అమెజాన్ డెలివరీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతడి పేరు ఎవాన్స్. ఓ రోజు వినియోగదారులు బుక్ చేసుకున్న అమెజాన్ ఐటంలను చేరవేసేందుకు తన ట్రక్కును డ్రైవ్ చేస్తు ఒక రైల్వే గేటు వరకు వెళ్లాడు. అక్కడ ఎలాంటి సిగ్నల్స్ లేవు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే అతడికి ఒక చెవు పని చేయదు. ఎంత మొత్తుకున్నా అతడికి ఆ చెవుద్వారా వినపడదు. అతడు అలానే రైల్వే ట్రాక్ ను తన ట్రక్కును దాటించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడి ఎడమ వైపు నుంచి రైలు వస్తుంది. అతడికి ఆ రైలు హార్న్ శబ్ధం వినిపించలేదు. అలాగే దాటుతున్న క్రమంలో ఆ రైలు.. ఆ ట్రక్కును ఈ డ్చుకొని కొంత దూరం వరకు వెళ్తుంది.

అక్కడ ఆ ట్రాక్కు రెండు ముక్కులు అవుతుంది. కానీ ఆ డ్రైవర్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. భూమి పై నూకలు ఉంటే.. ఎలాగైనా బతకొచ్చు అనేది ఇక్కడ సరిగ్గా సిరిపోతుంది. అయితే అతడి భార్య మాత్రం నా భర్తను ఆ దేవుడే కాపాడాడు అంటూ కృతజ్ఞతలు తెలిపింది. దయచేసి రైల్వే ట్రాకుల వద్ద సిగ్నల్స్ ను ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను కోరింది.

అమెజాన్ ప్రైమ్ లో విశేషాధారణ దక్కించుకుంటున్న ‘ముగ్గురు మొనగాళ్ళు’.. నంబర్ 2 లో స్ట్రీమ్..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టి నుంచో సుప‌రిచితుడే. అతడితో పాటు ‘దియా’ ఫేమ్ దీక్షిత్‌ శెట్టి, ‘వెన్నెల’ రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. వీరి ముగ్గురు ఇందులో అంగవైకల్యం కలిగి పాత్రలో నటించారు. ఇటీవల ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విశేషాధారణ పొందింది.

ట్రైలర్ తోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం ఓటీటీలో విడుదలయి ప్రేక్షకులను మెప్పిస్తోంది. వీరి ముగ్గురు ఓ మర్డర్ కేసులో ఇరుక్కొని అక్కడ నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు.. అక్కడ పరిణామాలు ఏమి సంభవించాయి.. ఎలాంటి పరిస్థితులను వాళ్లు ఎదుర్కొన్నారు అనేది స్టోరీ. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన “ముగ్గురు మొనగాళ్లు”లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా, దీక్షిత్ మూగవాడిగా, రామారావు అంధుడిగా… ఇలా ముగ్గురూ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించారు. రిత్విష్‌శర్మ, శ్వేత వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు.

రాజా రవీంద్ర క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా ప్రధాన పాత్ర పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి.. సురేష్ బొబ్బిలి స్వరాలు అందించారు. ‘చిత్రమందిర్‌ స్టూడియోస్‌’ బ్యానర్ పై పి. అచ్యుత్‌ రామారావు నిర్మాతగా దీనిని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ 2 గా ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకోవడంతో ఆ చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి గరుడు వేగ మేమ్ అంజి అందించిన విజువల్స్ అమోఘం అని చెప్పుకోవాలి.

దీనిలో ఇంకా.. నిజర్, జెమిని సురేష్, జోష్‌ రవి, భ‌ద్రం, సూర్య, జబర్తస్త్‌ సన్నీ నటించారు. దీనికి కో ప్రోడ్యూసర్లుగా తేజ చీపురుపల్లి,రవీందర్‌రెడ్డి అద్దుల వ్యవహరించారు. దినిలో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ గా చిన్నా, ఎడిటర్‌ గా బి. నాగేశ్వర రెడ్డి , ఆర్ట్‌ డైరెక్టర్‌గా నాని పనిచేశారు.

అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపు

పండుగ వచ్చిందంటే చాలు.. అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. రానున్న దసరా, దీపావళి వంటి పండుగలు రానున్నడంతో అమెజాన్ మరో భారీ సేల్ కు సిద్దం అవుతున్నాయి. ఈ ఏడాది కూడా అమెజాన్ అనే కామర్స్ సంస్థ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ను ప్రకటించింది. వీటిలో ప్రతీ ఉత్పత్తి ఐటెంపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని అమెజాన్ తెలిపింది.

స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్లు వంటి వాటిపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇంకా మరికొన్ని ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ సేల్ ఎప్పుడు.. మొదలవుతుంది అనే విషయాన్ని ప్రకటించాలి.

అక్టోబర్ లో ఈ సేల్ మొదలవుతుందని తెలుస్తోంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కు సంబంధించి డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను కొనుగోలు చేసే వాటిపై 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. మరో క్రెడిట్ కార్డు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇంకా దీనిలో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందుగానే అంటే 24 గంటల ముందు సేల్ అనేది యాక్సెస్ అవుతుందని పేర్కొంది. ఫ్యాషన్‌ ఉత్పత్తుల కొనుగోలు అదనంగా రూ. 300 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఫ్రీ స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను అందించనుంది. ఫైర్‌ టీవీ స్టిక్‌, ఎకో డివైజెస్‌, కిండెల్‌ లాంటి అమెజాన్‌ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందించనుంది.

ప్రెషర్స్ కు భారీగా ఐటీ కొలువులు.. అమెజాన్, విప్రో వంటి సంస్థల్లో ఖాళీలు..!

కోవిడ్ నేపథ్యంలో కొంతమందికి కొలువులు ఊడగా.. మరికొంతమందికి కొత్త కొలువులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తూ.. ఐటీ రంగానికి చెందిన పలు కంపెనీలు నిలబడ్డాయి. ఆర్థిక సేవలు, ఇతర రంగాల్లో డిజిటలీకరణ శరవేగంగా జరగడం ఐటీ కంపెనీలకు వరంగా మారింది.

ప్రాజెక్టులు అధికంగా రావడంతో దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తాజాగా అమెజాన్‌, విప్రో, క్యాప్‌జెమినీ వంటి దిగ్గజ సంస్థలు భారీగా నియామకాలకు సిద్ధమయ్యాయి. దీనిలో అమెజాన్ సంస్థ దాదాపు 55 వేల ఉద్యోగాలను నియమించుకునేందుకు సన్నాహాలు చేపడుతుంది. ఇది ఫేస్ బుక్ ఉద్యోగులకు సమానం కాగా.. గూగుల్ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య దాదాపు మూడో వంతు కంటే ఎక్కువగా ఉంది.

బీ టెక్ చేసిన వారికి ‘ఎలైట్‌ నేషనల్‌ ట్యాలెంట్‌ హంట్‌’తో ఈ అవకాశాన్ని కల్పించింది. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. విప్రోలో ఎంపికైన వారికి రూ.3- 3.8 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ ఇవ్వనుంది. 2022లో ఉత్తీర్ణులు అయ్యేవారు ఇందుకు అర్హులుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదే బాటలో క్యాప్ జెమినీ సంస్థ కూడా క్యాంపస్‌ డ్రైవ్‌ 2021 నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దానికి ఎంసీఏ, ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఇదే బాటలో అప్పిన్‌వెంటివ్‌ సంస్థ కూడా 500 మంది ఫ్రెషర్స్ ను తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ ఈ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ అప్పిన్‌వెంటి లో 700 మంది ఉద్యోగులు ఉన్నారు.

కొత్త అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్.. దాని విలువ ఎంతో తెలుసా..?

న్యూయార్క్‌ లోని ఓ భవనంలో ఒక అపార్ట్‌మెంట్‌ ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ విలువు ఎంతో తెలుసా.. అక్షరాల మన కరెన్సీలో రూ.171 కోట్లు (23 మిలియన్ డాలర్లు). ఇది 212 ఫిప్త్ అవెన్యూలో ఉన్న 4 బెడ్ రూంల అపార్ట్ మెంట్. ఇది న్యూయార్క్ లోని ప్లాటిరాన్ జిల్లాలో ఉంది. అంతక ముందే ఈ భవనంలో అతడు పెంట్ హౌస్ తోపాటు మూడు అదనపు యూనిట్ లను కొనుగోలు చేశాడు.

ఆ ఒక్క పెంట్ హైసే.. మూడు అంతస్థులు ఉంటుంది. మొత్తం మీద ఈ భవనంలో అతడి మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి సుమారు రూ.884 కోట్లకు చేరింది. దీంతో అతడు బిల్డింగ్ లోపల ఉన్న 4,155 చదరపు అడుగుల భాగాన్ని కొనుగోలు చేసినట్లయింది. ఇలా అతడు డబ్బు సంపాదనలోనే కాదు.. ఖర్చు పెట్టడంలోనూ ముందుంటానని నిరూపించాడు. జెఫ్ బెజోస్ కొనుగోలు చేసిన అపార్ట్ మెంట్ నంబర్ 20ఏ. దీని కొనుగోలుకు జూలైలోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు.. ఆగస్టు 6న డబ్బులు చెల్లించి సొంతం చేసుకున్నారు.

ఈ కొత్త అపార్ట్‌మెంట్‌ 22, 23, 24వ అంతస్తుల్లో విస్తరించి ఉన్న పెంట్ హౌస్ కింద ఉంటుంది. వీటిలో ఉన్న ప్రత్యేకతలేంటంటే.. ఈ భవనం నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్, మాడిసన్ స్క్వేర్ పార్క్ లను వీక్షించవచ్చంట. ఇది న్యూయార్క్ నగరంలో మొదటగా నిర్మించిన ఆకాశసౌధాలలో ఒకటిగా వెలుగొందుతోంది.

కోల్డ్ స్టోరేజ్, ది రైట్ ఫిట్ ఫిట్నెస్ సెంటర్, యోగా స్టూడియో ట్రీట్మెంట్ రూమ్, ప్లే రూమ్, ప్రత్యేక గేమ్ రూమ్ ఉంటాయి. ఇందులో రెసిడెన్షియల్ లాంజ్, క్యాటరింగ్ కిచెన్‌తో పాటు డైనింగ్/మీటింగ్ రూమ్ స్క్రీనింగ్ రూమ్ లు కూడా ఉంటాయి. ఈ భవనంలో ఇంకా టెక్సాస్ బిలియనీర్ ఎడ్ బాస్, ఈఎస్పిఎన్ హోస్ట్ మైక్ గ్రీన్బర్గ్, చార్లెస్, సెరిల్ కుష్నర్ వంటి సెలబ్రిటీలు కూడా కొనుగోలు చేశారు.

ఐకూ 7 టీజ్ ను మన దేశంలో లాంచ్ చేయనున్న కంపెనీ… ఆ ప్రత్యేకతతో ఎంతో చౌకైన ఫోన్ ఇదే!

ఐకూ 7 స్మార్ట్ ఫోన్ త్వరలోనే మన దేశంలో లాంచ్ కానుంది. అతి కొద్ది రోజులలోనే ఈ ఫోన్ ను అమెజాన్ సేల్స్ లో నిర్వహించనున్నారు.ఐకూ 7, ఐకూ 7 లెజెండ్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లను రూపొందించడంలో ఈ ఫోన్ సమస్థ, ప్రముఖ మోటార్ స్పోర్ట్స్ అయిన బీఎండబ్ల్యూ మోటార్స్ తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. త్వరలోనే మనదేశంలో కూడా ఇదే ప్రత్యేకతలను కలిగి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అమెజాన్ టీజర్ ప్రకారం ఐకూ నియో 5కు రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. అమెజాన్ ప్రకారం ఐకూ 7 ఫోన్ చైనాలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో లాంచ్ కాగా, ఇండియాలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అదేవిధంగా ఈ ఫోన్ వెనుక వైపు కెమెరాలు ఐకూ నియో 5 తరహాలోనే సెట్ చేయబడి ఉన్నాయి.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉండి అత్యంత చౌకైన ఫోన్ గా ఐకూ 7 లెజెండ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర కేవలం 40 వేల లోపు ఉండి,
66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. అయితే చైనాలో లాంచ్ చైనా ఈ ఫోన్లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ తో లాంచ్ అయ్యింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఐకూ 7 స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది.

అమెజాన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్..?

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇయర్ ఎండ్ నేపథ్యంలో అమెజాన్ మరో స్పెషల్ సేల్ ను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో అమెజాన్ ఈ సేల్ ను నిర్వహించనుంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల కోసం అమెజాన్ ఈ సేల్ ను నిర్వహిస్తుండగా ఈ సేల్ ద్వారా మొబైల్, మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఇతర వస్తువులను అమెజాన్ విక్రయించనుంది.

ఆమెజాన్ ఇప్పటికే ఒక మైక్రో సైట్ ను రూపొందించి మైక్రో సైట్ ద్వారా సేల్ లో భాగంగా విక్రయించే స్మార్ట్ ఫోన్లు, ఇతర వివరాలను విడుదల చేసింది. అమెజాన్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ ను ఇవ్వనుంది. ప్రముఖ బ్రాండ్లపై ఈ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంటుంది.

షియోమీ, హాన్సర్, శాంసంగ్, వన్ ప్లస్, నోకియా, రియల్ మీ, ఎల్జీ, జాబ్రా, ఒప్పో, యాపిల్ కంపెనీల స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. హెడ్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, కవర్లు, కేబుల్ లపై కూడా అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈరోజు తగ్గింపు ధరలను అమెజాన్ యొక్క మైక్రో సైట్ ద్వారా చూడవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, వన్‌ప్లస్ 8 టీ 5జీ, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్‌మీ నోట్ 9 ప్రో మాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, ఐ ఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ ఫోన్లను ఆఫర్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది.

అమెజాన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాటిపై భారీ డిస్కౌంట్?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై మెడిసిన్స్ ను సైతం కస్టమర్లు నేరుగా అమెజాన్ నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అమెజాన్ మెడిసిన్స్ కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లను అందిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం భారత్ లో ఈ అవకాశం లేకపోయినా భవిష్యత్తులో అమెజాన్ సంస్థ భారత్ లోనూ మెడిసిన్స్ ఆర్డర్ చేసే ఛాన్స్ కల్పించనుంది.

ప్రస్తుతం అమెజాన్ ద్వారా షూలు, ఇతర ఉత్పత్తులు ఏ విధంగా ఆర్డర్ చేసుకుంటున్నామో అదే విధంగా మెడిసిన్స్ ను సైతం ఆర్డర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అమెజాన్ అమెరికాలో ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తోంది. త్వరలో ఇతర దేశాల్లో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని.. మెడిసిన్స్ డోర్ డెలివరీ ద్వారా మరింత మంది కస్టమర్లకు చేరువకావచ్చని భావిస్తోంది.

అమెజాన్ ఫార్మసీ పేరుతో అమెజాన్ ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం. వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మెడిసిన్స్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. లాయల్టీ క్లబ్ మెంబర్లు అమెజాన్ లో మెడిసిన్స్ కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లను పొందే ఛాన్స్ ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి అమెరికా మెడిసిన్స్ డెలివరీ కోసం ప్రయత్నాలు చేయగా ప్రస్తుతంఅనుమతులు లభించాయి.

ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ అమెజాన్ పోటీ సంస్థలకు భారీ షాకులు ఇస్తోందనే చెప్పాలి. మెడిసిన్స్ డెలివరీలో సక్సెస్ అయితే అమెజాన్ భవిష్యత్తులో మరిన్ని రంగాల్లోకి అడుగులు వేయనుంది.