Tag Archives: Andalusia Parliament

పార్లమెంట్ ను వణికించిన ఎలుకలు.. పరుగులు పెట్టిన ఎంపీలు?

సాధారణంగా పార్లమెంట్ లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే అధికార పక్షాలు, ప్రతిపక్షాలు ఉండి అధికార పక్షాన్ని పలు విషయాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ తీవ్ర గందరగోళంగా ఉంటుంది.ఈ క్రమంలోనే ఏదైనా బిల్లు ఆమోదం పొందడానికి అధికారపక్షం ప్రవేశపెడితే అందుకు నిరసనగా ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తూ పార్లమెంట్ వాతావరణాన్ని గందరగోళానికి గురి చేస్తాయి. ఎప్పుడు ఎంతో గందరగోళంగా ఉండే ఈ పార్లమెంట్ సభ్యులను ఒక ఎలుక గడగడలాడించింది. పార్లమెంటులో ఎలుకల దూరి ఎంపీలను పరుగులు పెట్టించిన ఘటన స్పెయిన్‌లోని అండలుసియా పార్లమెంట్ లో జరిగింది.

ఈ సందర్భంగా పార్లమెంట్ లో జరుగుతున్న సమావేశంలో భాగంగా సుజానా డియాజ్ అనే రీజినల్ ప్రెసిడెంట్ సెనేటర్‌గా ఎంపికవ్వాలా? వద్దా అనే విషయం గురించి ఓటింగ్ జరుగుతున్న క్రమంలో స్పీకర్ మార్తా బాస్క్వెట్ మాట్లాడుతుండగా.. ఆమెకు పార్లమెంట్ ఆవరణలో ఒక ఎలుక కనిపించడంతో గట్టిగా అరుస్తూ నోరు మూసి పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే పార్లమెంటులో ఎలుక ఉందని గ్రహించిన మిగతా ఎంపీలు అక్కడి నుంచి పరుగులు పెట్టగా మరి కొందరు తమ కుర్చీల పైకి కాళ్ళు పెట్టుకుని అక్కడే కూర్చున్నారు. ఈ విధంగా ఎలుక కనిపించడంతో కొంత సమయం పాటు పార్లమెంట్ వాతావరణంలో అధికార, ప్రతిపక్షాలు గందరగోళం చేశారు. ఈ క్రమంలోనే ఎలుకలు పట్టే సమస్త సహాయ చర్యలతో అక్కడి నుంచి ఎలుకను తీసుకు వెళ్లిన తర్వాత తిరిగి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈ విధంగా పార్లమెంట్ వాతావరణంలో ప్రతిపక్షాలు చేయాల్సిన పని చిట్టెలుకలు చేసి గందరగోళం సృష్టించాయి. ఈ క్రమంలోనే ఎలుకను పార్లమెంటు భవనం నుంచి తీసుకెళ్లిన తర్వాత పార్లమెంటు సభ్యులు డియాజ్ కోసం ఓట్లు వేశారు .ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.