Tag Archives: announcement

Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!

Breaking News: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ గా భావిస్తున్న యూపీతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల తేదీల్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!

దీనిలో భాగంగానే.. దీనికి సంబంధించి ఎన్నికల తేదీలను ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని అత్యున్నత పోలింగ్‌ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ రోజు ప్రకటించనుంది ఎన్నికల సంఘం.

Breaking News: ఈ రోజే ప్రకటన.. మధ్యాహ్నం 3.30 గంటలకు తేదీలు ఖరారు..!

ఇక ఉత్తరప్రదేశ్ లో మొత్త 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మార్చిలో ఎన్నికల నిర్వహణ చేపట్టే అవకాశముంది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల నేపథ్యంలో యూపీతో పాటు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనా ఈ ప్రభావం పడబోతోంది.


సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను..

దీంతో సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను ముగించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఈసీ కోరింది.
ఎన్నికలు జరిగే లోపు మొత్తం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగైతేనే ఎన్నికల నిర్వహణ ద్వారా కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. ఇటీవల ఈ ఐదు రాష్ట్రాల్లోని శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు కుమార్‌ భల్లాతో సమీక్షించింది. ఈ సమావేశంలో రాజేష్‌ భూషన్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ బలరామ్‌ భార్గవ్‌ తదితరలు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. ప్రకటన చేసిన స్టార్ ప్రొడ్యూసర్..?

భారతదేశానికి ఒక తెలుగు నాయకుడు ప్రధానిగా పని చేసిన మొదటి వ్యక్తి పీవీ నరసింహరావు. ఆ పదవిలో ఉన్న ఒకే ఒక్క తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణం. అలాంటి ఈ లెజెండరీ లీడర్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది .

ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ ప్రకటన చేశారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు రావు బతికి ఉన్న సమయంలో.. ఆయన ప్రధానిగా దేశానికి చేసిన సేవలు తతితర విషయాలను ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశ రూపురేఖలను మార్చాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి అంశాలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అతడి జీవితంలో ఎన్నో మరపురాని విజయాలు ఉన్నాయి. ఆహా స్టూడియోస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించిన అల్లు అరవింద్.. పీవీ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు.

గతంలో వినయ్ సీతాపతి‘హాఫ్ లయన్’ పేరుతో పీవీ జీవిత కథను పుస్తకం రూపంతో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా పీవీ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ ఝా దర్శకత్వం వహించనున్నారు . ఈ సిరీస్ తెలుగు , హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులోకి రానుంది. దీనిలో నటించే వారి వివరాలు.. సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రే.. అధికారికంగా ప్రకటించిన తితిదే!

గత కొన్ని నెలల నుంచి హనుమంతుడి జన్మ స్థానం పై వివిధ రకాల వార్తలు వినిపించాయి. అయితే హనుమంతుని జన్మ స్థానం అంజనాద్రి అని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అధికారిక ప్రకటన చేశారు. తిరుపతి సప్తగిరుల్లో అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం అని,అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో హనుమంతుడు జన్మించినట్లు వెల్లడించింది.

ఈ విషయాన్ని తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఆంజనేయుడు జన్మస్థానం అన్వేషణకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు పలుమార్లు సమావేశమై లోతుగా పరిశీలించి సరైన ఆధారాలను సేకరించి ఆంజనేయుడి జన్మస్థానం అంజనాద్రే అని ప్రకటన చేసింది.

శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాము. అదేవిధంగా వెంకటాచల మహత్వాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నాము. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 రకాల పేర్లు ఉన్నాయి. అయితే త్రేతాయుగంలో దీనిని అంజనాద్రిగా పిలువబడింది. అంజనాదేవికి తపస్సు కారణంగా ఈ పర్వతంపై ఆంజనేయుడు జన్మించాడు.సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని తెలియజేస్తున్నాయి.

హంపి, విజయనగరం, గుజరాత్, మహారాష్ట్ర, ఇవేవీ ఆంజనేయుడు జన్మస్థలం కాదని, తితిదే అధికారులు స్పష్టం చేశారు.హనుమ జన్మస్థానంపై అన్వేషణకు ఏర్పాటు చేసిన కమిటీలో మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి తదితరులు ఉన్నారు