Tag Archives: australia

Virender Sehwag: ధోని కావాలనే అలా చేశారు.. మానసికంగా ఎంతో కుంగిపోయా.. ధోని పై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్!

Virender Sehwag: భారత జట్టు గర్వించదగ్గ ఓపెనర్ల లో ఒకరైనటువంటి వీరేంద్ర సెహ్వాగ్ తన అద్భుతమైన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన బ్యాట్ చేత పెట్టారంటే బాల్ బౌండరీ దాటాల్సిందే. ఎలాంటి బౌలర్ అయినా సరే ఈయనకు బౌలింగ్ చేయాలంటే కాస్త భయపడే వారు. సెహ్వాగ్ బ్యాటింగ్ వన్డే అయినా టెస్ట్ అయినా ఒకే రీతిలో ఉంటుంది.

తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ ఒక స్పోర్ట్స్ ఛానల్ తో ముచ్చటిస్తూ గతంలో తనకు జరిగిన ఒక చేదు సంఘటన గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే మహేంద్రసింగ్ ధోని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం వెళ్ళినప్పుడు తను తన ఫామ్ కోల్పోయాను. నాలుగు వన్డేల్లోనూ చాలా తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారని తెలియజేశారు.

ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆటతీరుపై ఎంతో మంది అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా నాలుగు వన్డేల్లోనూ సెహ్వాగ్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో మహేంద్రసింగ్ ధోని కావాలనే నన్ను తుది జట్టునుంచి తప్పించాడు. ఆ సమయంలో మానసికంగా ఎంతో కృంగి పోయానని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఆ రోజు సచిన్ లేకపోతే అదే జరిగేది…


ఆ సమయంలో వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం టెస్టులు మాత్రమే ఆడాలని ఫిక్స్ అయ్యాను అయితే సచిన్ టెండూల్కర్ చెప్పగా ఆయన ఇది నీ కెరీర్లో ఎంతో కఠినమైన దశ కొద్ది రోజులు ఓపిక పట్టు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత రిటైర్మెంట్ చేయాలా వద్దా అని ఆలోచించుకో అని చెప్పారు.ఆయన చెప్పిన విధంగానే కొన్ని రోజులపాటు ఓపికతో వేచి చూశాను అదృష్టవశాత్తు తిరిగి ఫామ్ లోకి వచ్చానని ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ గతంలో తనకు జరిగిన ఈ చేదు సంఘటన గురించి తెలియజేశారు.

సూపర్ మార్కెట్లో పాము.. దాన్ని చూసిన ఆ మహిళ ఏం చేసిందంటే..?

అడవిలో పాములు కనిపించడం అనేది సహజం. కానీ సూపర్ మార్కెట్ కు వెళ్లినప్పుడు పాము కనిపిస్తుందని ఎవరైనా ఊహిస్తారా. పైగా అది చిన్నది కూడా కాదూ… ఏకంగా 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ. అది వేగంగా పాకలేక… నెమ్మదిగా అక్కడే ఉంది. దానిని చూసిన వారు భయాందోళనకు గురయ్యారు. అక్కడ సామాన్ల నుంచి బయటకు వస్తూ కనిపించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని సూపర్ మార్కెట్‌ వద్ద జరిగింది. అక్కడ హెలెనా అల్లీ అనే ఓ మహిళ తన పిల్లల కోసం వాడే స్పైసెస్ డబ్బాల కోసం వెతుకుతుండగా… ఐటెమ్స్ మధ్యలోంచీ ముందుకొచ్చింది ఈ డైమండ్ పైతాన్ . దీన్ని చూడగానే హెలెనా ఉలిక్కి పడింది. వెంటనే మిగతా కస్టమర్లను ఆమె అలర్ట్ చేసింది. దీంతో కొందరు అక్కడ నుంచి బయటకు పరుగులు పెట్టారు.

మొదట్లో హెలెనా దానిని చూసినప్పుడు 8 అంగుళాల దూరంలోనే కనిపించింది. తర్వాత అది బయటకు వస్తూ పెద్దగా కనిపించింది. అయితే హెలెనాకు పాములు కొత్తేమి కాదు. ఆమె విషపూరితమైన పాముల్ని కూడా ఎలా పట్టుకోవాలో ట్రైనింగ్ కూడా తీసుకుంది. పాముని చూసినప్పుడు మొదట షాకైన ఆమె… ఆ తర్వాత వెంటనే కోలుకుంది. తనే స్వయంగా పామును వీడియో తీసింది. ఆమె కొన్నేళ్ల క్రితం సిడ్నీ వైల్డ్‌లైఫ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీలో పనిచేసిన అనుభవం ఉంది.

దీంతోనే ఆమె స్వయంగా ఓ సంచిలోకి ఆ పాము వెళ్లేలా చేసింది. అదంతా చూస్తున్న సూపర్ మార్కెట్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అంత పెద్ద పామును ఆమె బంధించిన విధానం చూసి అందరూ ఆమెను మెచ్చకున్నారు. దీంతో ఆమె ఆ పామును తీసుకెళ్లి దగ్గరలోని అడవికి తీసుకెళ్లి వదిలేసింది. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. అక్కడ ఆమె కస్టమర్లు కంగారు పడుతున్న క్రమంలో వారికి ధైర్యం చెబుతూ.. ఎవర్నీ ఏమి చేయదని చెప్పింది. దీంతో వాళ్లు కంగారు పడకుండా నెమ్మదించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ప్రశంసిస్తున్నారు.

ఎలుకల దెబ్బకు జైలు ఖాళీ చేసిన అధికారులు.. ఎవరంటే?

సాధారణంగా మన ఇంట్లోకి ఒక ఎలుక వచ్చిందంటే చాలు. ఇల్లు పీకి పందిరి వేస్తుంది.ఇంట్లో కనిపించిన వస్తువులన్నింటిని నాశనం చేస్తూ గందరగోళం సృష్టిస్తుంది. అలాంటిది కొన్ని పదుల సంఖ్యలో ఎలుకలు ఉంటే ఇక ఆ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాగే లక్షలాది సంఖ్యలో ఎలుకలు ఒక జైలులో ప్రవేశించడంతో దెబ్బకు జైలును కాళీ చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజుల నుంచి ఎలుకలలో ప్లేగు ప్రబలిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో ఎలకలు ఎక్కడ పడితే అక్కడ కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని జైలులో ఎలుకలు సంచరించి జైలులో సీలింగ్‌లో ఉన్న వైరింగును మొత్తం కొరికి నాశనం చేశాయి.

ఈ విధంగా సీలింగ్ నాశనమవడం గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై జైలును ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు మాట్లాడుతూ.. ఎలుకలు దాడి వల్ల ఫీలింగ్ పానెల్ మొత్తం దెబ్బతిందని, అందుకోసమే జైలును ఖాళీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గోడలకు ఉన్న రంధ్రాల ద్వారా సీలింగ్ లోకి కొన్ని ఎలుకల దూరి అవి అక్కడే చనిపోయాయని అధికారులు తెలిపారు.
ఎలుకలు ఎక్కువ సంఖ్యలో సీలింగ్ లో చనిపోవడం వల్ల వాటి శరీర భాగాలు కుళ్లిపోయి అధిక దుర్వాసన వస్తుండడంతో జైలును మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు.

వామ్మో.. ఎంత పెద్ద సాలీడు గుళ్ళు.. ఎప్పుడైనా చూశారా?

సాధారణంగా మనం కొన్ని రోజుల పాటు ఇంటిలో దుమ్ము ధూళిని శుభ్రపరిచకపోతే మన ఇంటిలో గోడలకు సాలెపురుగులు గూడు కట్టుకోవడం చూస్తుంటాము. ఈ విధంగా సాలెపురుగులు మన ఇంట్లో గూడు కడితే వెంటనే ఇంటిని శుభ్రపరచడం చేస్తుంటాము. కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా సాలెపురుగులు చెట్లు, పుట్టలకు సైతం గూడును కడుతుంటాయి.

ఈ విధంగానే ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గిప్స్ ల్యాండ్ ఈ ప్రాంతంలో కూడా సాలీడులు గూడును నిర్మించాయి. అయితే ఇందులో పెద్ద స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా… సాలి పురుగులు గూడును కట్టాయి అంటే మన ఇంట్లో నిర్మించినట్టుగా అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఈ గిప్స్ ల్యాండ్ ప్రాంతాన్ని ఏకంగా లక్షలాది సాలీడులు సొంతం చేసుకుని గూడును నిర్మించాయి.

ఒకేసారి లక్షలాది సాలీడులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించడమే కాకుండా గూడును నిర్మించడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక ఒక దుప్పటి కప్పిన విధంగా కనబడుతోంది. ఏకంగా ఈ సాలెపురుగులు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు గూడును నిర్మించాయి. అయితే ఇక్కడ ఆక్రమించుకున్న సాలెపురుగులు మన ఇంట్లో పెరిగే సాలెపురుగులు కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. వాగ్రాంట్ హంటర్ జాతికి చెందిన ఈ సాలెపురుగులు భూమిలోపల నివసిస్తాయి.

భూమి లోపల నివసించే ఈ సాలెపురుగులు వరద ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా ఆ ప్రాంతం మొత్తం గూడును నిర్మించుకుంటాయి. తాజాగా ఈ ప్రాంతంలో కూడా వరదలు రావడంతో భూమి లోపల ఉన్నటువంటి ఈ సాలెపురుగులు మొక్కలకు, చెట్లకు లాలాజలం స్రవించి ఈ విధంగా గూడును నిర్మించాయి. ప్రస్తుతం సాలెపురుగులు నిర్మించుకున్న ఈ గూడుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లీకైన చైనా రహస్య పత్రం ..కరోనా గురించి ఏం చెబుతోంది?

గత ఏడాది నుంచి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లో పుట్టింది. అయితే ఈ వైరస్ వూహాన్‌లో ల్యాబ్ నుంచి పరిశోధనలో నిర్వహిస్తుండగా లీకైనదా? లేక దానికదే వ్యాప్తి చెందిందా? లేకపోతే జన్య మార్పిడి చేసి జీవాయుధగా ఎవరైనా వదిలారా? అనే సందేహాలు అన్ని దేశాలు వ్యక్తం చేశాయి. అయితే చైనా పైనే ఉన్న నేపథ్యంలో ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చడానికి చైనా మిలిటరీ అధికారులకు సంబంధించిన రహస్య పత్రం లీక్ అయింది. ఇంతకీ ఆ రహస్య పత్రం కరోనా గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం….

కోవిడ్‌–19 ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై పరిశోధన చేస్తున్న అమెరికన్‌ అధికారులకు చైనాకు చెందిన ఓ రహస్య పత్రం దొరికింది. ఆ పత్రంలో ‘‘మనుషులు సృష్టించిన సార్స్, ఇతర కొత్త వైరస్‌లను జన్యు మార్పిడి చేసి జీవాయుధాలుగా వినియోగించడం అనే కథనంతో చైనా మిలిటరీ అధికారులు, సైంటిస్టులు రాసిన రహస్య పత్రం అది.

చైనా అధికారులు ఈ రహస్య పత్రాన్ని గత ఐదు సంవత్సరాల క్రితం అనగా 2015 వ సంవత్సరంలోనే ఈ పత్రం రాయడం గమనార్హం. సరికొత్త జెనిటిక్ ఆయుధాల శకంలో సార్స్, కరోనా వైరస్ లో ఒక భాగం.వీటిలో జన్యు మార్పిడి చేసి వీటిని ఒక జీవ ఆయుధాలుగా విడుదల చేయవచ్చు. ఈ ప్రపంచంలో మూడవ యుద్ధం అంటూ వస్తే అది కేవలం జీవాయుదాలతోనే వస్తుందని ఈ రహస్య పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.

ఈ విధంగా జీవాయిదాలను ప్రయోగించడం ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ చైనా ఆర్మీ అధికారులు అంచనా వేశారు. ఉగ్రవాదులు ఈ వైరస్ మన ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించి ఉంటారని అంచనా వేశారు. అయితే ఇది చైనా వూహన్ ప్రయోగశాల నుంచి పొరపాటున లిక్ అయిందా, లేక ఉద్దేశపూర్వకంగానే చేశారా అనే దానికి సరైన ఆధారాలు లేవు.

కొన్ని సంవత్సరాల నుంచి చైనా వూహన్ లాబ్లో ప్రమాదకరమైన కొత్త వైరస్‌లను సృష్టించి, పరిశోధనలు చేస్తోందని సమాచారం వినబడుతుంది.రహస్య పత్రంలో చైనాకు సంబంధించిన 18 మంది సైంటిస్టులు మిలిటరీ ఉన్నత అధికారుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ రహస్య పత్రం పై స్పందించిన చైనా ప్రభుత్వం కరోనా మూలాలపై చైనాను ఇరుకున పెట్టడం కోసమే ఇలాంటివి చిత్రీకరించారని పేర్కొంది.

కూతురు గదిలోకి వెళ్లి షాకైన తల్లి.. అసలేం జరిగిందంటే..?

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చోటు చేసుకున్న ఒక ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంట్లోని కూతురు గదిలోకి వెళ్లిన తల్లి వందల సంఖ్యలో సాలీడులను చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏది పని మీద కూతురు గదిలోకి వెళ్లిన మహిళకు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. గదిలోని ఏ మూల చూసినా పుట్టలుపుట్టలుగా సాలె పురుగులు ఉండటంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే పెటీ ఆర్ అనే ఒక మహిళ సిడ్నీలోని ఒక ఇంట్లో జీవనం సాగించేది. ఒకరోజు పెటీ ఆర్ కూతురు గదిని శుభ్రం చేయాలని అనుకొని గదిలోకి వెళ్లగా డోర్ తీసిన వెంటనే గోడపై వందల సంఖ్యలో సాలె పురుగులు కనిపించాయి. అవి ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అవాక్కైన మహిళ వెంటనే ఆ విషయాన్ని తన స్నేహితురాలికి తెలియజేసింది. ఆ తరువాత మహిళ, ఆమె స్నేహితురాలు ఆ సాలె పురుగులను ఇంటి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశరు.

సాలె పురుగులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర చేయి సైజులో ఉండే ఈ సాలె పురుగులను హంట్స్‌మన్ సాలె పురుగులని పిలుస్తారని తెలుస్తోంది. ఈ సాలె పురుగులు కరిస్తే వాంతులు, తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మొదట మహిళ ఫోటోలను షేర్ చేయగా చాలామంది ఆ ఫోటోలను ఫోటో షాప్ లో ఎడిట్ చేశారని కామెంట్లు చేశారు.

దీంతో సదరు మహిళ వీడియో పోస్ట్ చేసి ఆ ఫోటోలు రియల్ ఫోటోలేనని మార్ఫింగ్ ఫోటోలు కాదని ప్రూవ్ చేసింది. ఈ సాలె పురుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలకు షాకింగ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే హెచ్ఐవీ పాజిటివ్..?

దేశంలోని ప్రజల్లో చాలామంది కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు ప్రజల్లో కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్ ప్రజల్లో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కు కూడా కారణమవుతున్నట్టు తేలింది.

ఆస్టేలియా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. సీఎస్‌ఎల్‌ ఔషధ సంస్థ, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ప్రతికూల ఫలితాలు ఇవ్వడంతో వ్యాక్సిన్ ట్రయల్స్ ను అర్ధాంతరంగా రద్దు చేశారు. తొలి క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలను ఇచ్చిన ఈ వ్యాక్సిన్ రెండు, మూడు క్లినికల్ ట్రయల్స్ లో కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. కొందరిలో ఏకంగా హెచ్ఐవీ నిర్ధారణ అవుతుండటంతో వ్యాక్సిన్ ట్రయల్స్ అర్ధాంతరంగా రద్దు అయ్యాయి.

అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు భయాందోళనకు గురి కావద్దని చెబుతున్నారు. హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల్లో వ్యాక్సిన్ వల్ల వచ్చిన యాంటీబాడీలు ప్రభావం చూపుతున్నాయని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు హెచ్ఐవీ నిర్ధారణ అయినట్లు భావించాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి.

అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదట్లో పాజిటివ్ వచ్చినా తరువాత నెగిటివ్ వస్తోందని అందువల్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రయోగాలు రద్దు కావడంతో సదరు సంస్థకు 75 మిలియన్‌ డాలర్ల నష్టం వచ్చిందని సమాచారం.