సాధారణంగా మన ఇంట్లోకి ఒక ఎలుక వచ్చిందంటే చాలు. ఇల్లు పీకి పందిరి వేస్తుంది.ఇంట్లో కనిపించిన వస్తువులన్నింటిని నాశనం చేస్తూ గందరగోళం సృష్టిస్తుంది. అలాంటిది కొన్ని పదుల సంఖ్యలో ఎలుకలు ఉంటే ఇక ఆ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాగే లక్షలాది సంఖ్యలో ఎలుకలు ఒక జైలులో ప్రవేశించడంతో దెబ్బకు జైలును కాళీ చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజుల నుంచి ఎలుకలలో ప్లేగు ప్రబలిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో ఎలకలు ఎక్కడ పడితే అక్కడ కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలోని జైలులో ఎలుకలు సంచరించి జైలులో సీలింగ్‌లో ఉన్న వైరింగును మొత్తం కొరికి నాశనం చేశాయి.
ఈ విధంగా సీలింగ్ నాశనమవడం గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై జైలును ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు మాట్లాడుతూ.. ఎలుకలు దాడి వల్ల ఫీలింగ్ పానెల్ మొత్తం దెబ్బతిందని, అందుకోసమే జైలును ఖాళీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గోడలకు ఉన్న రంధ్రాల ద్వారా సీలింగ్ లోకి కొన్ని ఎలుకల దూరి అవి అక్కడే చనిపోయాయని అధికారులు తెలిపారు.
ఎలుకలు ఎక్కువ సంఖ్యలో సీలింగ్ లో చనిపోవడం వల్ల వాటి శరీర భాగాలు కుళ్లిపోయి అధిక దుర్వాసన వస్తుండడంతో జైలును మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…