ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గలేదు. రోజురోజుకు కేసులు తగ్గుతున్న క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తి వేశారు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ సరైన జాగ్రత్తలను పాటించడం ఎంతో ముఖ్యమని ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా సమయంలో జరిగిన కొన్ని వివాహాలు కరోనా నిబంధనలని అతిక్రమించి వివాదాస్పదంగా మారిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా రాజస్థాన్ సవాయు మాధోపూర్ జిల్లాలోని బదిలా గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి
రాజస్థాన్ ఎంపీ కిరోడీలాల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే ఇందిరా మీనా హజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా జరిగి నబరాత్‌లో ఎం,పీ ఎమ్మెల్యే బంధువులతో కలిసి డ్యాన్సులు చేశారు. ఈ విధంగా ఎంపీ ఎమ్మెల్యే డాన్స్ లు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రజలకు జాగ్రత్తలను చెప్పే ప్రజా ప్రతినిధులు ఈ విధంగా బాధ్యతారహితంగా మాస్కులు లేకుండా సామాజిక దూరం లేకుండా డాన్సులు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నాయి.ప్రజలకు సూచనలు చేయవలసిన నాయకులే ఈ విధంగా జాగ్రత్తలు పాటించకుండా బాధ్యతారహితంగా పాటిస్తే సామాన్య ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లి ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…