సీనియర్ నటులు ఇప్పుడు గనక ఇంటర్వ్యూలు ఇస్తే అప్పటి పరిస్థితులు ఇప్పటి సినిమాల పరిస్థితులను ఏ రకంగా గమనించారో.. అప్పటికి ఇప్పటికి సినిమాల విషయంలో వచ్చిన మార్పులు, నటీ – నటుల మధ్య ఉన్న వ్యత్యాసం, సినిమా దర్శక, నిర్మాతల ప్రవర్తన, అప్పటికి ఇప్పటికి సినిమా వ్యాపార పరంగా వచ్చిన మార్పులు…ఇలా ఎన్నో విషయాలను, జ్ఞాపకాలను వెల్లడిస్తుంటారు. ఈ విషయాలు చాలా వరకు తెలుసుకోవాలనే ఉత్సాహం, కుతూహలం అభిమానులతో పాటు ప్రేక్షకులందరిలోనూ ఉంటుంది. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అందులో సినిమా తారల అనుభావల పరంగా చూసుకుంటే ఒకరి ధోరణికి మరొకరి ధోరణికి అసలు పొంతనే ఉండదు.
అలా ఒక విభిన్నమైన వ్యక్తిత్వం, తనదైనా ఆలోచనా ధోరణితో ఎన్నో విషయాలను ఇప్పటికే పలు ఇంటర్వ్యూస్‌లో వెల్లడించారు సీనియర్ నటుడు భానుచందర్. భానుచందర్ ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారి కొడుకు. ఆ రకంగా ఆయనకి సినిమాలలోకి వచ్చేందుకు పెద్దగా శ్రమపడలేదు. తండ్రి సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా అటు తమిళ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలలో బాగా పేరున్న వ్యక్తి. ఆయనకి మంచి క్రేజ్ అండ్ పాపులారిటీ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి సంగీతం అందించారు. అద్భుతమైన ఆల్బంస్ ఇచ్చారు.
Bhanuchandar : తల్లి కోరడంతో నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరాడు.
అందుకే ఆయనకి దర్శక, నిర్మాతలతో, హీరోలతో మంచి అనుబంధం ఉండేది. దాంతో భానుంచందర్ కూడా సినిమాలకి సంగీతం అందించాలని తండ్రి మాదిరిగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని భావించాడు. ఈ కోరికతోనే గిటార్ నేర్చుకున్నాడు. చాలా ఈజీగా గిటార్ వాయించేవారు. కొంతకాలం ప్రముఖ సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర సహాయకుడిగాను పనిచేశారు. కానీ తల్లి కోరడంతో నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరాడు. ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో అలాగే హీరోగా మారి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు.
భానుచందర్ కెరీర్‌లో సూపర్ హిట్స్ ఉన్నాయి. సుమన్ లాంటి తోటీ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. పాత్రలో జీవించేవారు. ఒక సినిమా కమిటయితే అందులోని పాత్ర కోసం ఎంతగానో శ్రమించారు. ఆ తర్వాత కొత్తతరం హీరోలు రావడంతో భానుంచందర్ హీరోగా ఫేడౌట్ అయ్యారు. అప్పుడప్పుడు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా భానుచందర్ సినిమాల పరంగా అప్పటికి ఇప్పటీకి చాలా వ్యత్యాసం వచ్చిందని.. అప్పుడు ఒక సినిమా చేయాలంటే ప్రతీది దర్శక, నిర్మాతలు ఎంతో ప్లాన్ ప్రకారం జరిగేది. అప్పట్లో సినిమా అంటే పాషన్ ఉండేది. కానీ ఇప్పుడు సినిమా అంటే చింతపండు వ్యాపారంలా అయిపోయింది. కథతో సంబంధం లేకుండా యూత్ సినిమాలంటు బోల్డ్ కాన్సెప్ట్ అంటూ నానా చెత్త సినిమాలు తీస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలను చూస్తుంటే భానుచందర్ చెప్పిన విషయం కరెక్ట్ అనుకోవచ్చు.
Bhanuchandar : అన్నయ్య చెప్పిన మాట వినకపోతే ఈ రోజు భానుచందర్ ఇలా మీ ముందు ఉండేవాడు కాదు.
ఇక భానుచందర్ కెరీర్ మధ్యలో కొంతకాలం పూర్తిగా దెబ్బతింది. సినిమాలు ఫ్లాపవుతుండటంతో ఆ టెన్షన్ తట్టుకోలేక డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. దాంతో ఈ డ్రగ్స్ కి బానిసలా మారి సినీ కెరీర్ ని చాలా వరకు దెబ్బతింది. ఇది చూడలేక ఆయన అన్నయ్య భానుచందర్ ను కరాటేలో జాయిన్ చేశాడు. ఇందులో జాయిన్ అయ్యాక డ్రగ్స్ అలవాటు పూర్తిగా తగ్గిపోయింది. బ్లాక్ బెల్ట్ సాధించిన భానుచందర్ ఆ నేపథ్యంలో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇది ఆయన సినిమా కెరీర్‌కి ఎంతో తోడ్పడింది. ఆ రోజు అన్నయ్య చెప్పిన మాట వినకపోతే ఈ రోజు భానుచందర్ ఇలా మీ ముందు ఉండేవాడు కాదంటూ భానుచందర్ తెలిపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…