వీర వెంకట దుర్గ శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే ఎవరికీ అర్థం కాదు..కానీ జంధ్యాల అనగానే నవ్వుల రారాజు,హాస్య దర్శకుడని అందరూ గుర్తుపడతారు.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో పుట్టిన జంధ్యాల విజయవాడలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగానే నాటకాల పై ఎక్కువగా ఆసక్తి చూపే వాడు.కొన్ని సందర్భాల్లో నటించడమే కాకుండా కొత్త నాటికలు రాసి వాటిని స్టేజిపై ప్రదర్శించేవాడు. అయితే జంధ్యాల ప్రతిభను గమనించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గుమ్మడి గారు సినిమాలకు కథా రచయితగా పని చేయమని సలహా ఇచ్చాడు. జంధ్యాల మొదటగా దేవుడు చేసిన బొమ్మలు చిత్రానికి మాటలు రాయడం జరిగింది. ఆ తరువాత ప్రముఖ కళా దర్శకుడు కె.విశ్వనాథ్ సిరిసిరిమువ్వ అనే చిత్రానికి మాటల రచయితగా జంధ్యాలకు అవకాశం కల్పించడం జరిగింది.
ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అలాగే 1979లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీరామారావు, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన వేటగాడు చిత్రానికి జంధ్యాల మాటలు అందించడం జరిగింది. వేటగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. 1981 లో ముద్దమందారం అనే చిత్రానికి జంధ్యాల దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మల్లెపందిరి, నాలుగు స్తంభాలాట రెండు జెళ్ళ సీత, అహ నా పెళ్ళంట శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి లాంటి ఎన్నో హాస్య భరిత చిత్రాలను జంధ్యాల తెలుగు ప్రేక్షకులకు అందించారు. సుత్తివేలు, సుత్తి వీరభద్ర రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, విద్యాసాగర్, పూర్ణిమ, ప్రదీప్ లాంటి ఎంతో మంది హాస్యనటులను జంధ్యాల తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ క్రమంలోనే మరో నటుడు వరుణ్ రాజ్ చే కొన్ని సినిమాలు తీయాలని జంధ్యాల నిర్ణయించుకున్నారు.
వరుణ్ రాజ్ భానుప్రియ హీరో, హీరోయిన్లుగా ‘ష్..గప్ చుప్’ అనే చిత్రాన్ని నిర్మించారు. కానీ సినిమా విజయాన్ని సాధించలేదు. అలా వీరిద్దరి కలయికలో మరొక సినిమా రాలేదు. కాళరాత్రిలో కన్నెపిల్ల, ప్రేమే నా ప్రాణం, ష్.. గప్ చుప్ లాంటి తెలుగు చిత్రాల్లో మాత్రమే వరుణ్ రాజ్ నటించడం జరిగింది. అయితే ముంబై లో పుట్టి పెరిగిన వరుణ్ రాజ్ అసలు పేరు షఫీక్. సంజయ్ అనే మరొక పేరు కూడా ఉంది. వరుణ్ రాజ్ ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించడం జరిగింది. టాలీవుడ్ కు బ్రేక్ డాన్స్ లను చిరంజీవి ఎలాగా పరిచయం చేశారో.. అలాగే మాలీవుడ్ కు వరుణ్ రాజ్ బ్రేక్ డ్యాన్స్ లను పరిచయం చేసారు. మలయాళంలో మంచి పేరు సంపాదించడం తో పాటు హిందీలో “కులి కిరికిరి”అనే చిత్రంలో నటించారు. 2016 వరకు సినీపరిశ్రమలో కొనసాగి ఆ తర్వాత కలకత్తా వెళ్లి అక్కడ వ్యాపారం ప్రారంభించి.. అనతికాలంలోనే లాభాలను పొంది ప్రస్తుతం మంచి హోదాలో వరుణ్ రాజ్ కొనసాగుతున్నారు. ఆయన తిరిగి సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…