గత ఏడాది నుంచి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లో పుట్టింది. అయితే ఈ వైరస్ వూహాన్‌లో ల్యాబ్ నుంచి పరిశోధనలో నిర్వహిస్తుండగా లీకైనదా? లేక దానికదే వ్యాప్తి చెందిందా? లేకపోతే జన్య మార్పిడి చేసి జీవాయుధగా ఎవరైనా వదిలారా? అనే సందేహాలు అన్ని దేశాలు వ్యక్తం చేశాయి. అయితే చైనా పైనే ఉన్న నేపథ్యంలో ఈ అనుమానాలను మరింత బలం చేకూర్చడానికి చైనా మిలిటరీ అధికారులకు సంబంధించిన రహస్య పత్రం లీక్ అయింది. ఇంతకీ ఆ రహస్య పత్రం కరోనా గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం….
కోవిడ్–19 ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై పరిశోధన చేస్తున్న అమెరికన్ అధికారులకు చైనాకు చెందిన ఓ రహస్య పత్రం దొరికింది. ఆ పత్రంలో ‘‘మనుషులు సృష్టించిన సార్స్, ఇతర కొత్త వైరస్‌లను జన్యు మార్పిడి చేసి జీవాయుధాలుగా వినియోగించడం అనే కథనంతో చైనా మిలిటరీ అధికారులు, సైంటిస్టులు రాసిన రహస్య పత్రం అది.
చైనా అధికారులు ఈ రహస్య పత్రాన్ని గత ఐదు సంవత్సరాల క్రితం అనగా 2015 వ సంవత్సరంలోనే ఈ పత్రం రాయడం గమనార్హం. సరికొత్త జెనిటిక్ ఆయుధాల శకంలో సార్స్, కరోనా వైరస్ లో ఒక భాగం.వీటిలో జన్యు మార్పిడి చేసి వీటిని ఒక జీవ ఆయుధాలుగా విడుదల చేయవచ్చు. ఈ ప్రపంచంలో మూడవ యుద్ధం అంటూ వస్తే అది కేవలం జీవాయుదాలతోనే వస్తుందని ఈ రహస్య పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.
ఈ విధంగా జీవాయిదాలను ప్రయోగించడం ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందనీ చైనా ఆర్మీ అధికారులు అంచనా వేశారు. ఉగ్రవాదులు ఈ వైరస్ మన ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించి ఉంటారని అంచనా వేశారు. అయితే ఇది చైనా వూహన్ ప్రయోగశాల నుంచి పొరపాటున లిక్ అయిందా, లేక ఉద్దేశపూర్వకంగానే చేశారా అనే దానికి సరైన ఆధారాలు లేవు.
కొన్ని సంవత్సరాల నుంచి చైనా వూహన్ లాబ్లో ప్రమాదకరమైన కొత్త వైరస్‌లను సృష్టించి, పరిశోధనలు చేస్తోందని సమాచారం వినబడుతుంది.రహస్య పత్రంలో చైనాకు సంబంధించిన 18 మంది సైంటిస్టులు మిలిటరీ ఉన్నత అధికారుల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ రహస్య పత్రం పై స్పందించిన చైనా ప్రభుత్వం కరోనా మూలాలపై చైనాను ఇరుకున పెట్టడం కోసమే ఇలాంటివి చిత్రీకరించారని పేర్కొంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…