ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నటీనటులను ఎంపిక చేసుకుంటోంది.
రామాయణం తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా, సీత పాత్రలో కృతిసనన్ సందడి చేయనున్నారు. ఇక రామాయణంలో రావణాసురుడి పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు.
లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ను ఎంపిక చేసిన చిత్ర బృందం ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం బిగ్ బాస్ విన్నర్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఆదిపురుష్ చిత్రంలో మేఘనాథ్ పాత్రల్లో నటించడం కోసం చిత్ర బృందం హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్ విన్నర్ సిద్దార్థ్ శుక్లాను మేఘనాథ్ పాత్రలో నటించాల్సిందిగా దర్శకులు కోరినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే సిద్ధార్థ్ దశ తిరిగినట్లేనని,ఆదిపురుష్ చిత్రం పాన్ ఇండియా తరహాలో తెరకెక్కతుండడంతో ఇంత మంచి అవకాశాన్ని సిద్ధార్థ్ వదులుకోడనే సమాచారం కూడా వినబడుతుంది. అయితే ఈ విషయం గురించి ఆదిపురుష్ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇప్పటికే ముంబైలో రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం మూడో షెడ్యూల్ కూడా అక్కడే తీయాలని భావించినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ రద్దు చేయడంతో మూడో షెడ్యూల్ హైదరాబాద్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కరోనా అనంతరం శరవేగంగా షూటింగ్ జరుపుకుని ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…