Tag Archives: avasarala srinivas

Avasarala Srinivas: ఇండస్ట్రీలో రైటర్లకు గుర్తింపు లేదు… సంచలన వ్యాఖ్యలు చేసిన అవసరాల శ్రీనివాస్!

Avasarala Srinivas: అవసరాల శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు ఈయన నటుడిగా దర్శకుడిగా స్క్రిప్ట్ రైటర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ తను రాసిన కథలకు తానే దర్శకుడిగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా నాగశౌర్య, మాళవిక నాయక్ జంటగా నటించిన ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. ఈ సినిమా మార్చ్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇక ఈ చిత్రాన్ని ఒక లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అవసరాల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా అవసరాలు శ్రీనివాస్ ఇండస్ట్రీలో రచయితలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Avasarala Srinivas: డబ్బులు ఇస్తే సినిమా కథలు ఇస్తా…


ఇండస్ట్రీలో రచయితలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారి కష్టాన్ని గుర్తించి వారికి సరైన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే తన కథలను ఇతరులకు ఇవ్వకుండా తానే సినిమాలు చేస్తున్నానని అయితే తన సినిమా కథలకు డబ్బులు ఇస్తే ఇతరులకు కూడా ఇస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. ఇలా రచయితలకు డబ్బులు ఇవ్వరు అంటూ అవసరాల శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

Avasarala Srinivas: ఆర్టిస్ట్ గా సక్సెస్ కాకపోవడానికి కారణం అదే… విజయ్ సాయి గురించి ఆ వార్త విని షాకయ్యాను : అవసరాల శ్రీనివాస్

Avasarala Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా డైరెక్టర్ గా నటుడిగా అందరికీ ఎంతో సుపరిచితమైన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు సినిమాలలో నటుడిగా తన అద్భుతమైన కామెడీతో మెప్పించడమే కాకుండా సినీ రచయితగా కూడా పేరు పొందారు.ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Avasarala Srinivas: ఆర్టిస్ట్ గా సక్సెస్ కాకపోవడానికి కారణం అదే… విజయసాయి గురించి ఆ వార్త విని షాకయ్యాను: అవసరాల శ్రీనివాస్

ఈ విధంగా ఇండస్ట్రీలో నటుడిగా రచయితగా దర్శకుడిగా పేరు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ కెరియర్ లో పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.ఈ విధంగా తన కెరియర్ సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమిటి అనే విషయం గురించి తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సక్సెస్ అనే పదమే నచ్చదని తెలిపారు. తన వరకు తాను ఎంతో సక్సెస్ అయ్యాయని ఒక నటుడిగా రచయితగా డైరెక్టర్ గా తను ఎంతో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు.

Avasarala Srinivas: ఆర్టిస్ట్ గా సక్సెస్ కాకపోవడానికి కారణం అదే… విజయసాయి గురించి ఆ వార్త విని షాకయ్యాను: అవసరాల శ్రీనివాస్

సక్సెస్ అనేది మనకు మంచి పేరు తెచ్చి పెట్టడం కాదు మనం చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయి , మన సినిమాలను ప్రేక్షకులు ఆదరించినప్పుడే నిజమైన సక్సెస్ అంటూ ఆయన తెలిపారు.అష్టాచెమ్మ సినిమా చేసిన తర్వాత చాలామంది తన వద్దకు వచ్చి ఈ సినిమా కూడా అష్టాచెమ్మ మాదిరే ఉంటుంది అంటూ కథలు చెప్పేవారు. ఒకే తరహా సినిమాలు ఎన్ని చేస్తాం అందుకే తాను పెద్దగా సినిమాలలో నటించలేదని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యారు…

ఇకపోతే టాలీవుడ్ నటుడు విజయ్ సాయి మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన మరణం గురించి అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ అతను ఇండస్ట్రీలో ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఉన్నారు అంటూ తెలిపారు. అయితే ఆయన ఎప్పుడూ కలిసిన ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ చెప్పేవారు.ఇలా కెరీర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయసాయి మరణించాడనే వార్త వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్ విజయసాయి మరణం గురించి తెలిపారు.

అవసరాల శ్రీనివాస్ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం అదేనా..?

అష్టాచమ్మాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయమై దర్శకుడిగా, రచయితగా ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీనివాస్‌ అవసరాల. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద అనే రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు శ్రీనివాస్. ప్రస్తుతం అతడు రచయితగా, హీరోగా.. ‘నూటొక్క జిల్లల అందగాడు’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

సెప్టెంబర్ 3 న విడుదలైన ఈ సినమా ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తోంది. ఇంతలా అతడు సినీ పరిశ్రమలో దూసుకుపోతున్న అవసరాల శ్రీనివాస్.. వ్యక్తిగత జీవితానికి వస్తే.. పెళ్లి మాత్రం ఇంత వరకు చేసుకోలేదు. దీనికి గల కారణాలను అతడు ఓ యూ ట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కాకినాడలో జన్మించిన అతడు విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగినట్లు తెలిపాడు.

ఏ తల్లిదండ్రులకు తమ కుమారుడిని మంచి ప్రయోజకుడిగా చూడాలని అనుకుంటారు.. అంతే కాకుండా తన వ్యక్తి గత జీవితం కూడా బాగుండాలని కోరుకుంటారు. పెళ్లి విషయంలో అతడు తల్లిదండ్రులకు ఇష్టం లేదని చెప్పాడట. ఇప్పుడు చేసుకోవడం అస్సలు ఇష్టంలేదని.. ఈ విషయంపై తన తండ్రిని కూడా కన్విన్స్ చేసినట్లు చెప్పారు.

దానికి తన తండ్రి కొంచెం జలసీగా కూడా ఫీల్ అయ్యారని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంపై తన తండ్రితో రోజూ మాట్లాడుతున్నట్లు.. పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటర్ అని తన తండ్రి అనుకుంటున్నట్లు తను అభిప్రాయపడుతున్నట్లు శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పెళ్లి అనేది వయస్సు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే విషయం కాదని.. ఓపిక లేక నిర్ణయం తీసుకునే విషయం అంటూ చెప్పాడు. పెళ్లి చేసుకోకుండా ఉంటానికి గల కారణం అంటూ ఏమి లేదని అతడు చెప్పాడు.

కమెడియన్ విజయ్ సాయి మృతికి కారణం అదే.. అలా చనిపోతాడని అనుకోలేదు : అవసరాల శ్రీనివాస్

మొదట అష్టాచెమ్మా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలి పెట్టి.. సినిమాలపై ఆసక్తి కారణంగా ఇండస్ట్రీపై అడుగుపెట్టారు అతడు. తర్వాత అతడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇలా మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఆ తర్వాత ఉహలుగుసగుసలాడే, అమీతుమీ వంటి సినిమాల్లో నటించి ప్రతీ పాత్రలో నటించే టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. తాజాగా అతడు ‘నూటొక్క జిల్లాలో అందగాడు’ సినిమా ఈ నెల 3 థియేటర్లలో విడుదల అయి మంచి టాక్ తెచ్చుకుంది. రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిచారు.

ఇదిలా ఉండగా.. అతడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు స్టార్ బిరుదులు, అవార్డులు నచ్చవంటూ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ సాయి.. తెలుగులో ఎన్నో కామెడీ పాత్రల్లో నటించాడు. తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబరు 11 సోమవారం రోజున తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే శ్రీనివాస్.. విజయ్ సాయి గురించి మాట్లాడుతూ.. అతడికి ఆర్థిక పరంగా ఏవో కారణాలు ఉండటం కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. ఆ ఘటనతో తాను చాలా నేర్చుకున్నానని.. సినీ రంగంలో కొంతమంది పైకి కనిపించేంత జాలీగా, ఆనందంగా ఎవరూ ఉండరని.. దాని వెనకాల ఎంతో శ్రమదాగి ఉంటుందని చెప్పుకొచ్చాడు.