మొదట అష్టాచెమ్మా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలి పెట్టి.. సినిమాలపై ఆసక్తి కారణంగా ఇండస్ట్రీపై అడుగుపెట్టారు అతడు. తర్వాత అతడు హీరోగా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా ఇలా మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు.
ఆ తర్వాత ఉహలుగుసగుసలాడే, అమీతుమీ వంటి సినిమాల్లో నటించి ప్రతీ పాత్రలో నటించే టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. తాజాగా అతడు ‘నూటొక్క జిల్లాలో అందగాడు’ సినిమా ఈ నెల 3 థియేటర్లలో విడుదల అయి మంచి టాక్ తెచ్చుకుంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిచారు.
ఇదిలా ఉండగా.. అతడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు స్టార్ బిరుదులు, అవార్డులు నచ్చవంటూ చెప్పుకొచ్చాడు. అయితే విజయ్ సాయి.. తెలుగులో ఎన్నో కామెడీ పాత్రల్లో నటించాడు. తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబరు 11 సోమవారం రోజున తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే శ్రీనివాస్.. విజయ్ సాయి గురించి మాట్లాడుతూ.. అతడికి ఆర్థిక పరంగా ఏవో కారణాలు ఉండటం కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. ఆ ఘటనతో తాను చాలా నేర్చుకున్నానని.. సినీ రంగంలో కొంతమంది పైకి కనిపించేంత జాలీగా, ఆనందంగా ఎవరూ ఉండరని.. దాని వెనకాల ఎంతో శ్రమదాగి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…