Featured

విరిగిపడిన కొండచరియలు.. వైరల్ గా మారిన వీడియో..!

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం అంతా దాదాపు కొండలతో ఉంటుంది. ఏ మూలకు వెళ్లినా ఇలాంటి కొండలు కనిపిస్తాయి. అయితే తాజాగా సిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లా జిల్లాలోని జియోరి5 వ నెంబర్ జాతీయరహదారిపై జ్యోతి ఏరియాలో ఒక్కసారిగా పెద్దపెద్ద కొండరాళ్లు వచ్చి పడ్డాయి.
వాహనదారులు ముందుగా అవి కింద పడుతున్న సమయంలో గమనించడంతో దూరంగా తమ వాహనాలను నిలిపి ఆ దృశ్యాలను చూశారు. దీంతో వాటి దగ్గరకు ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత ప్రభుత్వ యాంత్రాగం అప్రమత్తం అయింది. ఆ ప్రాంతంలో ఎలాంటి రాకపోకలు రాకుండా అన్నింటిని నిలిపివేశారు.

స్పాట్‌కు చేరుకన్న ఆర్మీ, NDRF సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. కొండపై నుంచి రాళ్లు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా.. కొండ చరియలు విరిగి పడటంతో అక్కడ ఉన్న కొన్ని రాళ్లు, మట్టిపెడ్డలు ఎగిరి వచ్చి వాహనాలపై పడటంతో అవి స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో కొంతమంది వాహనాల్లో నుంచి దిగి పరుగులు పెట్టారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేశారు.

మరికొంత మంది తమ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణం. అంతక ముందే ఎన్నో సార్లు ఇలా జరిగాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండి.. జాగ్రత్తగా వాహనాలను నడపాలను అధికారులు సూచించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago