Categories: FeaturedMovie News

తొలివారం నామినేట్ అయింది వీరే .. అందరి టార్గెట్ అతడే !

బిగ్‏బాస్ సీజన్ 5లో రెండో రోజు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. షో మొదలైన రెండో రోజు ఎలిమినేషన్ అనేది కామన్ గా ఉంటుంది. తాజాగా ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆదివారం రోజు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు 19 మంది సభ్యులు. అయితే సోమవారం నాడే అసలు గేమ్ మొదలయ్యింది. ఫస్ట్ నైట్ నాడే తన గాండ్రించే గురకతో ఇంటి సభ్యులను మస్త్ పరేషాన్ చేసిండు వీజే లోబో. అతడి గురక నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. ఆయన గురక దెబ్బకు నిద్రరాక కొందరు లేచి ముచ్చట్లు పెట్టుకున్నారు. శ్వేతా, హమిద, జెస్సీ మాట్లాడుకుంటుండగా.. సిరి, జెస్సీ.. మిగతా సభ్యుల వస్తువులను కొట్టేశారు. ఇక తెల్లారగానే అంతా కలిసి ప్రమాణం అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. సిరి, శ్వేత, లోబో స్విమ్మింగ్ పూల్ లోకి దూకి సందడి చేశారు.

ఆ తర్వాత అసలు గేమ్ షురూ అయ్యింది. తమ వస్తువులు పోయాయంటూ మిగతా పార్టిసిపెంట్స్ గొడవ చేశారు. అయితే వాటిని దొంగిలించింది సిరి, జెస్సీ అని యాంకర్ రవి గుర్తించాడు. దీంతో తామే వాటిని దాచిపెట్టినట్లు వారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత పలువురు కంటెస్టెంట్లు తమ తమ వ్యక్తిగత విషయాల గురించి చెప్పారు. అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలుత శ్రీరామచంద్ర మానస్, సెస్సీని నామినేట్ చేశాడు. అనంతరం కాజల్, రవిని.. సరయు నామినేట్ చేసింది. హమిద, నటరాజ్‌ ను శ్వేత నామినేట్ చేసింది. జెస్సీ, మానస్ ను విశ్వ నామినేట్ చేశాడు. ఆనీ మాస్టర్.. సిరి, జెస్సీలను నామినేట్ చేసింది. జెస్సీ, విశ్వ, హామీదాను నామినేట్ చేసింది. నటరాజ్, మానస్‏ ను యాంకర్ రవి నామినేట్ చేశాడు.

అటు కార్తీకదీపం ఉమాదేవి.. కాజల్, జెస్సీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. లహరి, జెస్సీకి హమీదా నామినేట్ చేసింది. సన్నీ, లోబోను షణ్ముఖ్ నామినేట్ చేశాడు. షణ్ముఖ్, సరయును సన్నీ నామినేట్ చేశాడు. యాంకర్ రవి, జెస్సీని నటరాజ్ మాస్టర్ నామినేట్చేశాడు. సిరి, కాజల్‏లను ప్రియ నామినేట్ చేసింది. ప్రియా, యాంకర్ రవిని లోబో నామినేట్ చేశాడు. విశ్వ, సరయును మానస్ నామినేట్ చేశాడు. హమీదా, ప్రియను సిరి నామినేట్ చేసింది. సరయు, ఉమను కాజల్ నామినేట్ చేసింది. హమిదా, కాజల్‏ను లహరి నామినేట్ చేసింది. మొత్తంగా ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జెస్సీ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago