హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతా దాదాపు కొండలతో ఉంటుంది. ఏ మూలకు వెళ్లినా ఇలాంటి కొండలు కనిపిస్తాయి. అయితే తాజాగా సిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. సిమ్లా జిల్లాలోని జియోరి5 వ నెంబర్ జాతీయరహదారిపై జ్యోతి ఏరియాలో ఒక్కసారిగా పెద్దపెద్ద కొండరాళ్లు వచ్చి పడ్డాయి.
వాహనదారులు ముందుగా అవి కింద పడుతున్న సమయంలో గమనించడంతో దూరంగా తమ వాహనాలను నిలిపి ఆ దృశ్యాలను చూశారు. దీంతో వాటి దగ్గరకు ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తర్వాత ప్రభుత్వ యాంత్రాగం అప్రమత్తం అయింది. ఆ ప్రాంతంలో ఎలాంటి రాకపోకలు రాకుండా అన్నింటిని నిలిపివేశారు.

స్పాట్‌కు చేరుకన్న ఆర్మీ, NDRF సిబ్బంది సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. కొండపై నుంచి రాళ్లు పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా.. కొండ చరియలు విరిగి పడటంతో అక్కడ ఉన్న కొన్ని రాళ్లు, మట్టిపెడ్డలు ఎగిరి వచ్చి వాహనాలపై పడటంతో అవి స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో కొంతమంది వాహనాల్లో నుంచి దిగి పరుగులు పెట్టారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేశారు.
మరికొంత మంది తమ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణం. అంతక ముందే ఎన్నో సార్లు ఇలా జరిగాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండి.. జాగ్రత్తగా వాహనాలను నడపాలను అధికారులు సూచించారు.

































