Tag Archives: bangarraju

Bangarraju Movie: బంగార్రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించలేదా.. ఎందుకీ పక్షపాతం!

Bangarraju Movie: గత కొంతకాలం నుంచి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య పెద్ద యుద్ధం నడుస్తోందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిఒక్కరిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం సినిమా రేట్లను తగ్గించింది.ఈ క్రమంలోనే సినిమా రేట్లను తగ్గించడం వల్ల చాలామంది నష్టపోతారని టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరొక సారి పునరాలోచన చేయాలని సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Bangarraju Movie: బంగార్రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించలేదా.. ఎందుకీ పక్షపాతం!

ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో దిగిన సినిమాలలో కెల్లా బంగార్రాజు సినిమా పెద్ద సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పకపోయినా అబవ్ యావరేజ్ అని చెప్పవచ్చు.

Bangarraju Movie: బంగార్రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం పేదవారి గురించి ఆలోచించలేదా.. ఎందుకీ పక్షపాతం!

ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. మొదటివారం ఎంతో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా దాదాపు 80 శాతం పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఏ సినిమాలో జరగని అద్భుతం బంగార్రాజు సినిమాలో ఎందుకు జరిగింది అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

ఈ సినిమాకు పర్మిషన్ ఉంది..

సాధారణంగా ఏపీ ప్రభుత్వం కేటాయించిన టికెట్ల రేట్లను బట్టి ఏ సినిమాకి కూడా 100 రూపాయలకు పైగా టికెట్లను అమ్మకూడదు. కానీ నాగార్జున బంగార్రాజు సినిమా కోసం ఏపీలో థియేటర్లు 150,200 రూపాయలతో టికెట్లు అమ్మారు.ఇదేంటి అని ప్రశ్నిస్తే ఈ సినిమాకు పర్మిషన్ ఉంది అనే సమాధానం వినబడుతోంది.ఈ క్రమంలోనే ఎంతోమంది ఏపీ ప్రభుత్వానికి బంగార్రాజు సినిమా విషయంలో పేదవారు కనిపించడం లేదా ఎందుకీ పక్షపాతం అంటూ పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bangarraju Movie: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావయ్యా..బంగార్రాజు!

Bangarraju Movie: అక్కినేని నాగార్జున నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న బంగార్రాజు చిత్రాన్ని 2016 లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు. ఆ సినిమాలో ఎండింగ్ తో ఈ సినిమా మొదలుపెట్టారు.

Bangarraju Movie: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావయ్యా..బంగార్రాజు!

బంగార్రాజు సినిమాల్లో నాగార్జున నరకానికి కాకుండా స్వర్గానికి వెళ్లి రంభ ఊర్వశి మేనకలతో సరసాలాడటం చూపిస్తారు.ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున మనవడిగా చిన్న బంగార్రాజు పాత్రలో నాగచైతన్య నటించారు. చిన్న బంగార్రాజు జన్మించగానే తన తల్లి సీతమ్మ (లావణ్య త్రిపాటి) చనిపోయినట్లు చూపిస్తారు.

Bangarraju Movie: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావయ్యా..బంగార్రాజు!

కొన్ని సంవత్సరాల తర్వాత సత్యమ్మ (రమ్యకృష్ణ) కూడా మరణించి స్వర్గానికి వెళుతుంది. స్వర్గం నుంచి వారి మనవడు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి వీరిద్దరూ భూమి పైకి వచ్చి తన మనవడిని చక్కదిద్దారు. ఇది బంగార్రాజు సినిమా కథ.అయితే ఈ కథలో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారని నెటిజన్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.

అందుకే లావణ్య త్రిపాఠి పాత్ర లేదు..

సత్యమ్మ (రమ్యకృష్ణ) కంటే ముందుగా సీతమ్మ చనిపోతుంది. అయితే ఆమె మాత్రం స్వర్గంలో చూపించలేదు. ఈ చిన్న లాజిక్ బంగార్రాజు ఎలా మర్చిపోయారని నెటిజన్లు పెద్దఎత్తున ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. అయితే ఇలా లావణ్య త్రిపాఠి చూపించకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఇదివరకే లావణ్య త్రిపాఠి నాగచైతన్య కలిసి నటించారు కనుక ఈ సినిమాలో తనని నాగచైతన్య తల్లి పాత్రలో చూపించలేక తన పాత్రకు అక్కడితో ముగింపు పలికారని డైరెక్టర్ ఒకానొక సందర్భంలో తెలియజేశారు. అందుకే ఇలాంటి లాజిక్కుల గురించి మాట్లాడకుండా సినిమాని మాత్రమే ఆనందించాలి.

Bangarraju-Nagarjuna: బంగార్రాజు సీక్వెల్ రెడీ.. ! హింట్ ఇచ్చేసిన నాగార్జున..!

Bangarraju-Nagarjuna: కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకోవాలో లేదా.. పెద్ద సినిమాలు విడుదలను వాయిదా వేసుకోవడం వల్ల అనుకోవాలో తెలియదు కానీ.. నాగార్జునకు ఈ సంవత్సరం కలిసి వచ్చిందనే చెప్పాలి. సంక్రాంతి విడుదలకు పెద్ద సినిమాలు విడుదల కాకపోవడవతో కెలక్షన్లతో దూసుకుపోతోంది బంగార్రాజు సినిమా.

Bangarraju-Nagarjuna: బంగార్రాజు సీక్వెల్ రెడీ.. ! హింట్ ఇచ్చేసిన నాగార్జున..!

మొత్తంగా రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్ . పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలను గ్రామీణ ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. అంతే కాదు.. ఒకే ఫ్రేమ్ లో తండ్రీ కొడుకులు కనిపించడం అటు నాగ్ అభిమానులతో పాటు.. ప్రేక్షకులకు కూడా కనులపండగుగా ఉంది.

Bangarraju-Nagarjuna: బంగార్రాజు సీక్వెల్ రెడీ.. ! హింట్ ఇచ్చేసిన నాగార్జున..!

‘మనం’ సినిమాలో ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఈ వారసులు.. మళ్లీ ఈ సినిమాలో కనిపించారు. ఒకవేళ నాగేశ్వరరావు బతికి ఉన్నట్లైతే.. నాగచైతన్య నాన్నగా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చేవారు. అప్పుడు ఇక మరో మనం సినిమాను మళ్లీ చూసినట్లు అయి ఉండేది. ఏదేమైనా.. హిట్ కోసం కొన్ని సంవత్సారాల నుంచి ఎదురు చూస్తున్న నాగార్జునకు ఆ దాహం తీరినట్లే కనిపిస్తోంది.


వచ్చే ఛాన్స్ ఉన్నాయని ఓ హింట్ ఇచ్చాడు.. అదేంటంటే..

ఇక సినిమా టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వాననికి సపోర్టుగా ఉన్నాడు కాబట్టే.. ఏపీలో మూడు రోజులు నైట్ కర్ఫ్యూని వాయిదా వేశారని.. కావాలనే జగన్ ప్రభుత్వం నాగార్జునకు ఫేవర్ చేశారనేది కొందరు సినీ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా విజయవంతం అవ్వడంతో నాగార్జున విలేకరులతో మాట్లాడారు. ఇక బంగార్రాజు సినిమాకు కూడా సీక్వెల్ వస్తుందా అని అడగ్గా.. వచ్చే ఛాన్స్ ఉన్నాయని ఓ హింట్ ఇచ్చాడు. సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. బంగార్రాజు అక్కడే మొదలయ్యింది. అయితే చివరలో శివాలయంలో 24 ఏళ్లకు ఓ సారి హోమం చేయాలి. అది కూడా నాగార్జున ఫ్యామిలీ మాత్రమే చేయాలి. దానిని బంగార్రాజు చిత్రంలో ఒక హోమం పూర్తి చేశారు. మరో హోమం బేస్ చేసుకొని.. మరో సారి సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే.. అప్పుడు చూద్దాం అని నాగార్జున చెప్పడంతో.. బంగార్రాజు సీక్వెల్ పక్కాగా వస్తుందనేది కొందరు అభిప్రాయపడుతున్నారు.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

Bangarraju: నాగార్జున బంగార్రాజు చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అక్కినేని మల్టీస్టారర్ సంక్రాంతి హిట్‌ని సాధించడానికి గ్రౌండ్ రిలీజ్ కాబోతోంది. పండుగకు పెద్దగా విడుదలయ్యే ఇతర చిత్రాలేవీ లేవు. దీంతో దీనిపై విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల లేకపోవడంతో బంగార్రాజుకు కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ , ఆక్యుపెన్సీ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

Bangarraju: నాగార్జున విషయంలోనే ఎందుకు ఇలా..? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది..?

ఈ విషయంపై మంత్రి పేర్ని నాని కూడా సంక్రాంతి సినిమాలను విడుదల తేదీలను వాయిదా వేయమని కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. సినిమాలను వాయిదా వేయమని సూచించిన ప్రభుత్వం ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ , ఆక్యుపెన్సీ పరిమితుల ప్రణాళికలను కూడా వాయిదా వేసింది. జనవరి 18 నుంచి కర్ఫ్యూ అంటూ పేర్కొంది ప్రభుత్వం.


ఇప్పుడు అది అతనికి ఈ మార్గంలో..

దీనిని బట్టి చూస్తే.. ఏపీ ప్రభుత్వం నాగార్జునకు ఫేవర్ గా ఉంటుందనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
సినీ పరిశ్రమను కలవరపెడుతున్న ఏపీ టిక్కెట్ల సమస్యపై నాగార్జున సినీ పరిశ్రమ వైపు నిలవకుండా.. ఏపీ ప్రభుత్వం వైపు మాట్లాడారు. అంతే కాదు.. టికెట్స్ ను తగ్గించడం కరెక్ట్ అని.. తన సినిమాకు ఏ మాత్రం ప్రాబ్లం లేదు అంటూ.. ఏపీ ప్రభుత్వానికి మద్ధతుగా మాట్లాడారు. అందుకే అతనికి ఈ సహాయాలు లభించాయని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున ఏపీ ప్రభుత్వంతో చాలా మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అది అతనికి ఈ మార్గంలో సహాయపడింది. ఇక అంతకముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా సందర్భంలో కూడా.. 100శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చు అని ఏపి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక ఇవన్నీ చూస్తుంటే.. నాగార్జునకు ఏపీ ప్రభుత్వం ఫేవర్ చేస్తుందంటూ.. సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Bangarraju: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు..కానీ మరో బ్యాడ్ న్యూస్ ఎంటంటే..!

Bangarraju: అటు బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ గా ఉటూ.. ఇటు సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమాలో నటించాడు. ఇందులో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.

Bangarraju: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు..కానీ మరో బ్యాడ్ న్యూస్ ఎంటంటే..!

ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా.. జనవరి 14న థియేట్రికల్‌గా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో సంక్రాతి బరిలో నిలిచే సినిమాలకు బాగా కలిసిరానుంది. అందులో ఈ సినిమా కూడా కావడం విశేషం.

Bangarraju: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు..కానీ మరో బ్యాడ్ న్యూస్ ఎంటంటే..!

ఇదంతా ఇలా ఉంటే.. ఈ బంగార్రాజు సినిమా ఫైనల్ కాపీ ఇంకా సిద్ధం కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానులను కాస్త నిరాశే అని చెప్పాలి. దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా సాగుతున్నాయి. నాగార్జున కూడా అదే పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కంటెంట్ పై బంగార్రాజు పూర్తి నమ్మకంగా ఉన్నట్లు సమాచారం.


రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.25కోట్లు ..

తన యాజమాన్యంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీఎఫ్‌ఎక్స్, సౌండ్ మిక్సింగ్ పనులను వ్యక్తిగతంగా నాగార్జున పర్యవేక్షిస్తున్నాడు. నాగార్జున దగ్గర నుంచి డైరెక్ట్ ఆర్డర్‌లతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లోని టెక్నీషియన్లు కూడా బంగార్రాజుపై పూర్తిగా దృష్టి పెట్టారు. మూవీ చిత్ర యూనిట్ అంతా.. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బంగార్రాజు ఇప్పటి వరకు నాగార్జున కెరీర్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.25కోట్లు దాటినట్లు తెలుస్తోంది. కేవలం ఏపీలోని సీడెడ్ ప్రాంతంలోనే రూ.12 కోట్ల రేషియో వచ్చినట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం 2016లో వచ్చిన సాగ్గాడే చిన్నినాయనకు ప్రీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఇక దీనికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని వహిస్తుండగా.. విడుదలైన అన్నీ పాటలు బంబర్ హిట్ కొట్టాయి.

బంగార్రాజుగా హిట్ కొడతారా.. తండ్రీ, కొడుకుల హ్యాట్రిక్ నిలిచేనా..?

అక్కినేని వారసత్వం నుంచి వచ్చిన నాగచైతన్య .. సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. తాత నాగేశ్వర్ రావు, తండ్రి నాగార్జున వారసత్వం నుంచి మూడో తరం హీరోగా సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఇది నాగచైతన్య సినిమా అన్న రేంజ్ లో హిట్ సాధించలేదు. అయితే మధ్యమధ్యలో హిట్లు ఇచ్చినా.. బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ పడలేదు. దీనికి తోడు సమంతతో విడాకుల వ్యవహారంలో నాగ చైతన్య వార్తల్లో నిలిచారు. 

ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా చేస్తున్నారు నాగచైతన్య. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు నాగార్జున తో కలిసి రెండు సినిమాలు  చేసిన నాగచైతన్యకు.. బంగార్రాజు మూడో చిత్రం. ఇంతకు ముందు  2014లో మనం సినిమాలో నటించాడు. తాత నాగేశ్వర్ రావు, తండ్రి నాగార్జునతో పాటు తమ్ముడు అఖిల్ తో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

విక్రమ్ కే. కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం సినిమా విజయాన్ని నమోదు చేసింది. ఈసినిమాలో నాగార్జునకు తండ్రిగా కనిపించారు నాగచైతన్య. దీని తర్వాత ప్రేమమ్ సినిమాలో మరోసారి నాగార్జునతో కలిసి నటించారు. ఈ సినిమాలో నాగచైతన్యకు తండ్రిగా నాగార్జున నటించారు.

అయితే ఈసినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాలేదు. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బంగార్రాజు సినిమాలో నాగార్జునకు మనువడిగా నాగచైతన్య నటిస్తున్నారు. బంగార్రాజు సినిమాలో నాగార్జునకు జోడిగా సీనియర్ యాక్టర్ రమ్యక్రిష్ణ నటించగా… నాగచైతన్యకు జోడీగా యంగ్ క్రష్ కృతి శెట్టి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

అదిరిపోయిన నాగ చైతన్య బంగార్రాజు ఫస్ట్ లుక్..!

నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య జంటగా నటిస్తున్నటువంటి చిత్రం బంగార్రాజు. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా వస్తున్నటువంటి చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

ఇక ఇందులో నాగార్జున సరసన శివగామి రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నారు. ఇకపోతే నవంబర్ 23 వ తేదీ నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో తను నటిస్తున్న బంగార్రాజు చిత్రం నుంచి వరుస సర్ప్రైస్ లను ఇవ్వనున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం బంగార్రాజు చిత్రం నుంచి చిత్రబృందం నాగచైతన్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే ఈసారి బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య బంగార్రాజు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో మంగళవారం ఉదయం 10:23 గంటలకు బంగార్రాజు చిత్రం నుంచి మరొక సర్ ప్రైజ్ రానుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఈ క్రమంలోనే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ లుక్ అక్కినేని నెటిజన్లను ఆకట్టుకుంది.