Tag Archives: bjp leader

Ravi Prakash: వారి అండతో కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించడానికి సిద్ధమైన రవి ప్రకాష్!

Ravi Prakash: రవి ప్రకాష్ పరిచయం అవసరం లేని పేరు ఒక సాధారణ రిపోర్టర్ గా ఉన్నటువంటి ఈయన ఏకంగా టీవీ9 న్యూస్ ఛానల్ స్థాపించి ఒక సంచలనం సృష్టించారు. ఇలా టీవీ9 ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తా సమాచారాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక టీవీ9 ప్రేరణగా తీసుకొని ఎన్నో న్యూస్ చానల్స్ అందుబాటులోకి వచ్చాయి.

రవి ప్రకాష్ టీవీ9 సీఈఓగా దేశవ్యాప్తంగా టీవీ9 సేవలను విస్తరిస్తూ దూసుకెళ్తున్న సమయంలో ఒక ఫోర్జరీ కేసు ఆయన మెడకు బిగుసుకుంది. ఈ ఫోర్జరీ కేసు కారణంగా రవి ప్రకాష్ జైలు పాలు కావడం అనంతరం బెయిల్ పై విడుదలైనప్పటికీ ఈయన అజ్ఞాతంలోనే ఉండిపోయారు.అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిజెపి నేత సుజనా చౌదరి కూడా ఇటీవల కాలంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.ఈయన కూడా బెయిల్ పై బయటకు రావడంతో కొన్ని కంపెనీల నుంచి తన ఇన్వెస్ట్మెంట్ ను రద్దు చేసుకున్నారని సమాచారం. అయితే ఆ లాభాలతో సరికొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించాలనే ఆలోచన చేసినట్టు తెలుస్తుంది.

Ravi Prakash: సుజనా అండతో న్యూస్ ఛానల్ ప్రారంభించనున్న రవి ప్రకాష్….

ఈ క్రమంలోనే టీవీ9 రవి ప్రకాష్ తో కలిసి ఈయన మరొక న్యూస్ ఛానల్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే ఈ న్యూస్ ఛానల్ వచ్చే ఎన్నికలలోపు ప్రారంభించాలని ఈ న్యూస్ ఛానల్ ప్రారంభించడానికి అదే అనువైన సమయం అని భావించినట్టు తెలుస్తోంది.ఇలా రవి ప్రకాష్ ద్వారా సరికొత్త న్యూస్ ఛానల్ ప్రారంభిస్తే తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక సంచలనమే అని చెప్పాలి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Raja Singh : విప్లవ పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే ఆమెని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత రాజా సింగ్ డిమాండ్!

Raja Singh : ప్రముఖ నటి సాయి పల్లవి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో రానా సరసన సాయి పల్లవి నటించింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి గోసంరక్షకులని కాశ్మీరీ పండిట్ లతో పోల్చటం పెద్ద దుమారం లేపాయి. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యాడు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ మండిపడ్డాడు. ముస్లింలు, క్రైస్తవుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎవ్వరికీ ధైర్యం ఉండదు… కానీ హిందువుల మీద మాత్రం ఇలాంటీ వ్యాఖ్యలు చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు.

Sai pallavi: అలాంటి పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడైపోయింది… వెంటనే తనని అరెస్ట్ చేయాలి బీజేపీ నేత డిమాండ్!

సాయి పల్లవి సినిమా కోసం కమ్యూనిస్టులు పుస్తకాలు చదివి ఆమె మెదడు పనిచేయడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు నమోదు చేయాలని చెప్పుకొచ్చాడు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు ఇలా ఒకరిని శిక్షిస్తే తప్ప మరెవరూ ఇలాంటి పని చేయటానికి సాహసం చేయరు అంటూ కోపంతో ఊగిపోయాడు.

ఏం మాట్లాడినా సినిమా ప్రమోషన్ కోసం అంటారు…

ఇదిలా ఉండగా ఇప్పటికే హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి మీద కేసు నమోదు అయ్యింది. అంతే కాకుండా ఆమె నటించిన విరాటపర్వం సినిమా బాయ్ కాట్ చేయాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం గురించి తాజాగా సాయి పల్లవి స్పందించింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఏమి మాట్లాడినా కూడా సినిమా కోసం మాట్లాడుతున్నాను అనుకుంటారు. ఇప్పుడు నేను సినిమా విడుదల అవుతుందన్న సంతోషంలో ఉన్నాను. సినిమా విడుదల అయిన తర్వాత ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చింది.

Manchu Vishnu: వివాదంలో మంచు విష్ణు జిన్నా మూవీ… వార్నింగ్ ఇచ్చిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి!

Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మంచు కుటుంబం ఈమధ్య కాలంలో ఏదో ఒక విషయంలో వివాదంలో చిక్కుకొని సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కొత్త సినిమా మరొక వివాదంలో చిక్కుకుంది. విష్ణు నటిస్తున్న కొత్త సినిమా జిన్నా అనే పేరును విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ టైటిల్ పోస్టర్ తీవ్ర వివాదానికి తెర తీసింది.

Manchu Vishnu: వివాదంలో మంచు విష్ణు జిన్నా మూవీ… వార్నింగ్ ఇచ్చిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి!

ఇకపోతే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ తిరుమల కొండ వెనుక నుంచి వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు. అదేవిధంగా తిరుమల కొండపై జిన్నా అనే పేరు ఉంచడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మంచు విష్ణు పై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన విష్ణును హెచ్చరిస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Manchu Vishnu: వివాదంలో మంచు విష్ణు జిన్నా మూవీ… వార్నింగ్ ఇచ్చిన బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి!

మహమ్మద్ అలీ జిన్నా గురించి విష్ణు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మంచు విష్ణుకు హితబోధ చేశారు. భారతదేశంలో కొన్ని వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి, ఎన్నో మానభంగాలకు కారణమైన జిన్నా పేరును తన సినిమాకి పెట్టుకోవడం ఎంతో సిగ్గుచేటు అంటూ మంచు విష్ణు పై నిప్పులు కురిపించారు. ఇక గుంటూరులో జిన్నా పేరుమీద ఉన్న టవర్ సైతం తొలగించాలని ఒకవైపు మేము ఉద్యమం చేస్తుంటే మరోవైపు మీరు అతని పేరును సినిమాకు పెట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు.

హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు…

ఈ విధంగా దేశ విభజనకు కారణమైన ఓ వ్యక్తి పేరు సినిమాకి పెట్టుకోవడం చూస్తుంటే అతని గురించి పూర్తిగా మీకు తెలుసా లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. ఇక అలాంటి వ్యక్తి పేరు సినిమాకి పెట్టుకోవడమే కాకుండా ఏకంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై సినిమా పేరు పెట్టి హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందూ మనోభావాలను గౌరవిస్తూ మంచు విష్ణు తక్షణమే సినిమా పేరును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

చెల్లాచెదురైన జీవితాలు అంటూ ఏపీ వరదలపై స్పందించిన రాములమ్మ..!

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అధికంగా పడటంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది. ఇదిలా ఉండగా ఏపీ వరదలపై తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు సినీ నటి విజయశాంతి స్పందించారు. తుఫాను ప్రభావం వల్ల రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

ఈ క్రమంలోనే విజయశాంతి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ కన్నీటి కడలిలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు రాయలసీమ జిల్లాలను చూస్తే గుండె బరువెక్కుతోంది. అధిక వర్షం ప్రభావం కారణంగా వాగులు వంకలు పొంగి గ్రామాలను నీటిలో ముంచేశాయి.

కళ్ళ ముందే ఎన్నో మూగజీవాలు కుటుంబసభ్యులు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది అలాగే చేతికొచ్చిన పంట నాశనం కావడంతో ఎంతో మంది జీవితాలు చెల్లాచెదురై పోయాయి. వీరి జీవితాలు ఎప్పటికీ తేరుకు ఉంటాయో అంటూ విజయశాంతి ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వీరికి తోడుగా మానవవనరుల సహాయం అవసరం అనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా ఎన్సీసీ విద్యార్థులను తీసుకుంటే త్వరగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడవచ్చు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. రాయలసీమలోని పలు జిల్లాలలో వరద బీభత్సం అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలబడ్డాయి.

ఆ సినిమాపై కేసు పెట్టనున్న సాధినేని యామిని.. సినిమాలపై పడ్డ బీజేపీ యువనేత!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ కావాలంటే తప్పనిసరిగా పబ్లిసిటీ ఎంతో అవసరం. పబ్లిసిటీ లేకపోతే ఆ సినిమా అంటూ ఒకటి ఉంటుందని ఎవరికీ తెలియదు. ఈక్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ సినిమాలు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించుకుంటాయి. ఇక చిన్న సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలలో ఏదైనా కాంట్రవర్సి వస్తే తప్ప ఈ సినిమాల గురించి చాలామందికి తెలియదు.

ఈ విధంగా కాంట్రవర్సీలు ద్వారా పెద్దయెత్తున పబ్లిసిటీ జరిగిన సినిమాలు ఇది వరకు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది.”ఇప్పుడు కాక ఇంకెప్పుడు”అనే సినిమా ఒకటి ఉందని చాలామందికి తెలియదు.అయితే ప్రస్తుతం ఈ సినిమా మాత్రం సోషల్ మీడియాలో తెగ కాంట్రవర్సీలకు కారణమైంది. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాలో చాలా సన్నివేశాలు హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న అంటూ పలువురు ఆరోపణలు వ్యక్తం చేశారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ లు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సన్నివేశాలను తెరకెక్కించారని ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా విషయంపై బీజేపీ యువనేత యామిని సాధినేని కూడా స్పందించారు.

ఈ సినిమాలోని పాటలు, సన్నివేశాలు, డైలాగులు హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేత ఆరోపించారు.యుగంధర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను ఆగస్టు 6న విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే విడుదల చేసిన ట్రైలర్ పలు వివాదాలకు కారణం అయింది. ట్రైలర్ లో భాగంగా శృంగార సన్నివేశాలు వస్తున్న సమయంలో ఆదిశంకరాచార్యుల వారి భజగోవిందమనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాడుకోవడంతో ఇది పలు వివాదాలకు కారణమవుతోంది. ఈ విషయమై తాను సినిమా పై కేసు వేస్తానని యామిని ట్వీట్ చేయడంతో ఈ విషయం కాస్తా మరింత వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు యుగంధర్ క్షమాపణ చెప్పినట్టు తెలుస్తోంది.

జగన్ పిల్లోడే కానీ నెంబర్ వన్ సీఎం.. బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు..?

ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు బాబు మోహన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సీఎం జగన్ నంబర్ 1 సీఎం అని అన్నారు. ఒకవైపు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన బాబు మోహన్ మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శలు చేశారు. సీఎం జగన్ మొదటి స్థానంలో ఉంటే కేసీఆర్ చివరి స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నాడంటూ బాబు మోహన్ కొనియాడారు.

గ్రామ, వార్డ్ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి పెన్షన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ జరిగేలా చేశారని అన్నారు. కరోనా సమయంలో ప్రత్యేక వాహనాల సహాయంతో ప్రతి ఊరిలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేలా చేశారని.. రాజకీయ అనుభవం లేని జగన్ అద్భుతంగా పాలన సాగించాడని అన్నారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కరోనా సమయంలో అస్సలు పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జగన్ ను మెచ్చుకున్నారని.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే జగన్ అద్భుతంగా పని చేయడంతో ఆయనకు నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ ప్రధానిని మారుస్తానని చెబుతూ ఉంటారని.. రేపటి ఎన్నికల్లో ఎవరు ఎవరిని మారుస్తారో తెలుస్తుందని అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లని చెప్పారని కేసీఆర్ కు మాత్రం ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్లు మాత్రమే దేవుళ్లు అని అన్నారు. దళితులంటే కేసీఆర్ లెక్క ఉండదని.. పేదోళ్లంటే కేసీఆర్ కు అడ్రస్ ఉండదంటూ బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందరూ ఛీ కొట్టినా నేను బీజేపీలో చేరాను.. మాధవీలత షాకింగ్ పోస్ట్..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో చాలామంది నాయకులు గతంలో ఉన్న పార్టీల నుంచి మెరుగైన భవిష్యత్తు కోసం మరో పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో సరైన ప్రాధాన్యత లేని నేతలు, పదవుల కోసం ఆశ పడుతున్న నేతలు జంపింగులు చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే వెంటనే కండువా మార్చేస్తున్నారు.

ఇలా పార్టీలు మారుస్తున్న నేతల గురించి నటి, బీజీపీ యువ మహిళానేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరిన సమయంలో విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు బీజేపీలో చేరడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన కాషాయం మనిషి అయిపోరని మాధవీలత అన్నారు. కండువా కప్పుకుంటే దేశభక్తి, జాతీయతాభావం తన్నుకురాదని పేర్కొన్నారు.

భక్తి అనేది బ్లడ్ లో, నరనరాల్లో ఉండాలని, రక్తంలో ఉండాలని అప్పుడే కాషాయాన్ని సరిగ్గా మోయగలరని అన్నారు. అవసరానికి, పదవుల కోసం అయితే కొన్నాళ్లే ఉంటారని.. పదవులు తీసుకున్నంత మాత్రాన గొర్రె సింహం కాదని పేర్కొన్నారు. అందరూ ఛీ కొట్టినా తాను బీజేపీలో చేరానని.. నన్ను ఛీ అన్నవాళ్లు సిగ్గు లేకుండా ఇప్పుడు కాషాయ కండువా కప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

వాళ్లు పార్టీలో చేరినా చేరినా తాను ఛీ ఛీ అనడం లేదని తనకు తనకు సంస్కారం ఉందని మాధవీలత పేర్కొన్నారు. నాది ఒకటి కండువా, ఒకటే మాట మీరు ఊసరవెళ్లులు, నక్కలు అని మాధవీలత అన్నారు. 88 శాతం మంది ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారని యథా రాజా తథా ప్రజా అంటూ పోస్ట్ పెట్టారు.