Tag Archives: Caste

Mohan Babu: అంటరాని వాడు అంటే చెప్పుతో కొడతాను అన్నాను… కులాలు అంటే అసహ్యం: మోహన్ బాబు

Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు గురించి చెప్పాల్సిన పనిలేదు సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నిర్మాతగాను మెప్పించినటువంటి మోహన్ బాబు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన యూనివర్సిటీ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. వృత్తిపరంగా.ఎంతో బిజీగా ఉన్నటువంటి మోహన్ బాబు తాజాగా కులాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోహన్ బాబు యూనివర్సిటీలో జెండా ఎగరవేసిన అనంతరం ఈయన తన గ్రామంలో ఉన్నటువంటి రైతులతో తన యూనివర్సిటీలో 100 మొక్కలను నాటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఇలా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోహన్ బాబు కులాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు కులాల విభేదాలు అంటే చాలా అసహ్యమని ఈయన తెలియజేశారు. ఒకప్పుడు కులమత బేధాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా వరుస పెట్టి పిన్ని బాబాయ్ అక్క మామ అంటూ చాలా ఆప్యాయంగా పలకరించుకునేవారు కానీ ప్రస్తుతం ఇలాంటి సందర్భాలు ఎక్కడా లేవని ప్రతి ఒక్కరు కులం పేరుతో దూషిస్తున్నారని ఈయన తెలిపారు.

Mohan Babu: కులం పేరుతో దూషిస్తున్నారు…

చిన్నప్పుడు నా స్నేహితుడిని ఒకరు అంటరాని వాడు అంటే తాను కోపంతో చెప్పు తీసుకొని కొడతా అని వార్నింగ్ ఇచ్చానని తెలిపారు. ఇలా కులాలతో దూషించడం నాశనానికి కారణమని అందుకే తనకు కులాలు అంటే అసహ్యం అంటూ మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Manjima -Gautham Karthik: పెళ్లికి ముందు మీడియాతో ముచ్చటించిన మంజీమా కార్తీక్.. కులం గురించి ప్రశ్నించిన రిపోర్టర్!

Manjima -Gautham Karthik: కోలీవుడ్ సెలబ్రిటీలు మంజీమా గౌతం కార్తీక్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా ఈనెల 28వ తేదీ వివాహం చేసుకోబోతున్నారు.ఈ క్రమంలోనే వీరి ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా తమ పెళ్ళికి కుటుంబీకులు అంగీకారం తెలిపారని వెల్లడించారు.

ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ దంపతులు మరొక రెండు రోజులలో పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి రెండు రోజులు ఉందనగా ఈ సెలబ్రిటీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజీమా మాట్లాడుతూ..నవంబర్ 28వ తేదీ తమ వివాహం చెన్నైలో కేవలం కుటుంబీకులు అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో జరగబోతుందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ దేవరాట్ట సినిమా టైంలో తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండేదని అనంతరం ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలిపారు. ఇక గౌతమ్ కూడా మాట్లాడుతూ తాను వీక్ అయిన ప్రతిసారి మంజీమా తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపేదని తనని ప్రోత్సహిస్తూ ఉండేదని తెలియజేశారు. ఇలా కుటుంబ సమక్షంలో తమ వివాహం చేసుకోబోతున్నామని త్వరలోనే మా పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీడియాతో పంచుకుంటామని తెలిపారు.

Manjima -Gautham Karthik: పెళ్లికి కులానికి సంబంధం ఏంటి…


ఇక వీరు మాట్లాడిన అనంతరం చివరిలో ఒక రిపోర్టర్ వీరిని ప్రశ్నిస్తూ సార్ మీరు దేవర్‌ కులానికి చెందిన వాళ్లు. ఆమె కేరళకు చెందిన అమ్మాయి. మరి మీ ఇంట్లో ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు అంటూ వీరి కులం గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.దీంతో గౌతమ్ కార్తీక్ పెళ్లికి కులానికి సంబంధం ఏంటి అంటూ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

ఏపీలో పాఠశాలల ప్రారంభం అప్పుడే.. సెలవులు తగ్గించిన సర్కార్..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే వైరస్ భయం తగ్గినా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇప్పటికే కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో జగన్ సర్కార్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం అకడమిక్ క్యాలండర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.

దాదాపు ఐదు నెలల పనిదినాలు తగ్గడంతో జగన్ సర్కార్ అందుకు అనుగుణంగా సిలబస్ ను తగ్గించేందుకు కసరత్తు చేస్తుండటం గమనార్హం. అదే సమయంలో విద్యార్థులకు పండగ సెలవులను తగ్గించి ఉపాధ్యాయుల సెలవులపై కూడా పరిమితిని విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. నవంబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే పాఠశాలలు ఏప్రిల్ 30 వరకు పని చేయనున్నాయి.

వారానికి ఆరు పని దినాలు ఉండే విధంగా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2020 ఏప్రిల్ నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉపాధ్యాయులు నెలకు రెండున్నర రోజుల సెలవు దినాలను మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ సిలబస్ తగ్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సిలబస్ తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.

విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఇకపై పాఠశాలల హాజరు పట్టికలో కులం, మతం వివరాలు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినీవిద్యార్థుల పేర్లను ఒకే రంగు సిరాతో రాయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో పాటించిన విధానాలను ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.