Manjima -Gautham Karthik: కోలీవుడ్ సెలబ్రిటీలు మంజీమా గౌతం కార్తీక్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా ఈనెల 28వ తేదీ వివాహం చేసుకోబోతున్నారు.ఈ క్రమంలోనే వీరి ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా తమ పెళ్ళికి కుటుంబీకులు అంగీకారం తెలిపారని వెల్లడించారు.
ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ దంపతులు మరొక రెండు రోజులలో పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్లి రెండు రోజులు ఉందనగా ఈ సెలబ్రిటీలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంజీమా మాట్లాడుతూ..నవంబర్ 28వ తేదీ తమ వివాహం చెన్నైలో కేవలం కుటుంబీకులు అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో జరగబోతుందని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ దేవరాట్ట సినిమా టైంలో తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండేదని అనంతరం ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలిపారు. ఇక గౌతమ్ కూడా మాట్లాడుతూ తాను వీక్ అయిన ప్రతిసారి మంజీమా తనలో ఎంతో ఉత్సాహాన్ని నింపేదని తనని ప్రోత్సహిస్తూ ఉండేదని తెలియజేశారు. ఇలా కుటుంబ సమక్షంలో తమ వివాహం చేసుకోబోతున్నామని త్వరలోనే మా పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీడియాతో పంచుకుంటామని తెలిపారు.
ఇక వీరు మాట్లాడిన అనంతరం చివరిలో ఒక రిపోర్టర్ వీరిని ప్రశ్నిస్తూ సార్ మీరు దేవర్ కులానికి చెందిన వాళ్లు. ఆమె కేరళకు చెందిన అమ్మాయి. మరి మీ ఇంట్లో ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు అంటూ వీరి కులం గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.దీంతో గౌతమ్ కార్తీక్ పెళ్లికి కులానికి సంబంధం ఏంటి అంటూ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…